అంతా అబద్ధం.. ప్లేట్ ఫిరాయించిన అఖిల

వైఎస్ఆర్సీ పార్టీలోకి వెళ్తున్నారా.. లేక జనసేన పార్టీలో జాయిన్ అవున్నారా.. అఖిల ప్రియపై జస్ట్ నిన్నటి వరకు జరిగిన ప్రచారం ఇది. ఆమె జంపింగ్ పై జోరుగా బెట్టింగ్ నడిచింది. ఒక దశలో స్వయంగా అఖిల ప్రియ లీకులు వదిలారు. తను మరో పార్టీలోకి వెళ్లబోతున్నట్టు సంకేతాలు పంపించారు. ఇందులో భాగంగా గన్ మెన్లను వెనక్కి పంపించి తన నిరసన కూడా తెలియజేశారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో.. అఖిల పూర్తిగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె కరడుగట్టిన టీడీపీ నేతలా మాట్లాడుతున్నారు.

జనసేన లేదా వైసీపీలో జాయిన్ అవుతానంటూ తనపై వచ్చిన పుకార్లను ఖండించారు అఖిలప్రియ. అలాంటిదేం లేదని ఇన్నాళ్లూ తనపై వచ్చిన వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా మరోసారి గెలిచి తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్నారు అఖిల. తమ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన చంద్రబాబును కాదని మరో పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.

ఇంత సడెన్ గా అఖిల ప్లేటు ఫిరాయించడంతో అవాక్కవ్వడం విశ్లేషకుల వంతు అయింది. రాత్రికి రాత్రి అధిష్టానం నుంచి ఆమెకు బలమైన హామీ అయినా లభించి ఉండాలి లేదంటే గట్టిగా బ్రెయిన్ వాష్ అయినా జరిగి ఉండాలి. రెండోదే జరిగి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబుకు అఖిల ప్రియను ఓదార్చేంత అవసరం లేదు టైమ్ అంతకంటే లేదు.
× RELATED అంతా లైకులే.. కానీ నో లవ్ స్టొరీ అంటున్నారు!