నాగబాబు ఏం సాధించినట్లు?

బాలకృష్ణ గతంలో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు కౌంటర్ గా నాగబాబు వరుసగా వీడియోలను విడుదల చేశాడు. ఆరు వీడియోల్లో కూడా బాలకృష్ణ చేసిన ఒక్కో విమర్శను తీసుకుని నాగబాబు తనదైన శైలిలో విమర్శించాడు. చివరి వీడియోలో ఇంకాస్త ఘాటుగా బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరు ఎవరికి భయపడరు ఎందుకులే అనుకుని ఇనాళ్లుగా భరిస్తూ వచ్చాం. కాని ఇకపై అలా ఉండదు. నీవు ఏమాట అన్నా వెంటనే స్పందిస్తానంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించినా కూడా నాగబాబు మాత్రం మళ్లీ బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తే తాను రియాక్ట్ అవుతానంటూ నాగబాబు చెప్పడంతో ఈ వివాదం ఇక్కడితో ఆగేది కాదని అనిపిస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ హడావుడిలో ఉన్న కారణంగా ఈ వ్యాఖ్యలపై నో కామెంట్ అంటూ దాట వేస్తున్నాడు. త్వరలోనే బాలకృష్ణ నాగబాబు కామెంట్స్ కు వరుసగా జవాబు చెప్తాడని నందమూరి అభిమానులు అంటున్నారు.

సినిమా పరిశ్రమలో అంగర్గత విభేదాలు లేకుండ అంతా కలిసి ఉండాలని పైకి మాటలు చెప్పే వారు ఇలా కుమ్ములాడుకోవడంతో గొడవ పెద్దది అవ్వడంతో పాటు ఇండస్ట్రీ రెండుగా చీలుతుందనే ఆవేదన సామాన్య సినీ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందమూరి వర్గం మెగా వర్గం అంటూ రెండు వర్గాలుగా ఇండస్ట్రీ విడిపోతే పై వారికి ఎలాంటి ఇబ్బంది లేదు కింది టెక్నిషియన్స్ మరియు నటీనటులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ వివాదాన్ని ఇంతగా లాగి నాగబాబు ఇండస్ట్రీలో గొడవలు పెట్టాడు తప్ప మరేం సాధించినట్లు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. బాలకృష్ణ అయినా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తాడో లేదంటే కౌంటర్ ఎటాక్ ఇస్తాడో చూడాలి.× RELATED Mega Star Chiranjeevi Slaps Nagababu | #Nagababu | #Chiranjeevi | i5 Network