ఆ టైటిల్ పై మోజు పడుతున్న ప్రభాస్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. సాహో భారీ బడ్జెట్ చిత్రం అవ్వడంతో పాటు భారీ యాక్షన్ మూవీ అవ్వడం వల్ల చాలా సమయం తీసుకుంటుంది. ఈ సమయంలోనే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రేమ కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రంకు ‘జాను’ అనే టైటిల్ దాదాపుగా ఖరారైందంటూ క్లారిటీ వచ్చేసింది. అధికారిక ప్రకటన రాకున్నా కూడా చిత్ర యూనిట్ సభ్యులు జాను టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఈ టైటిల్ పై ప్రభాస్ బాగా ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. జాను టైటిల్ రెండు అక్షరాల టైటిల్ అవ్వడంతో పాటు - జాను అంటే హిందీలో డార్లింగ్ అనే అర్థం వస్తుంది. డార్లింగ్ అనేది ప్రభాస్ ముద్దు పేరనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ ఇప్పటికే ప్రభాస్ కు సక్సెస్ ను తెచ్చి పెట్టింది రెండు అక్షరాల టైటిల్ మిర్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ‘జాను’ టైటిల్ ను ప్రభాస్ కోరుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక విభిన్నమైన ప్రేమ కథతో రూపొందుతున్న ఈ చిత్రంను 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా యూవీ వారి నుండి సమాచారం అందుతోంది. ఇక సాహో చిత్రాన్ని ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
× RELATED ప్రభాస్ ను డైరెక్ట్ చేయడంలో ఒత్తిడి లేదు!