టీడీపీది కట్టప్ప కత్తి పార్టీ: నాని

మాది కోడికత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్న టీడీపీ నాయకులు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీనా అని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కొడాలి టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామ - స్వర్గీయ ఎన్టీఆర్ చివరగా బాబు గురించి.. ఆయన బతుకు గురించి ప్రజలకు ఏం చెప్పారో ఒక్కసారి వీడియో చూడాలని హితవు పలికారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా లేడని.. బాబును మించిన అవినీతి చక్రవర్తి దేశంలోనే ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీ చంకను నాలుగేళ్లుగా నాకి.. ఇప్పుడు నాటకాలాడుతున్నాడని కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు గడిచిన ఎన్నికల్లో గుడ్డలూడదీసి పంపారంటూ ఎద్దేవా చేశారు. సోనియా - రాహుల్ వెంట సూట్ కేసులతో బాబు డబ్బులు మోశాడని మండిపడ్డారు.

 వైఎస్ జగన్ పాదయాత్రకు వచ్చిన స్పందన.. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడాన్ని చూసి బాబు జీర్ణించుకోవడం లేదని మండిపడ్డారు. పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి వైఎస్ జగన్ ను అధికారంలోకి రాకుండా చేయాలని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబుకు అసలు సిగ్గూ శరం లేదని.. పవన్ కళ్యాణ్ అంత తిడుతున్నా తమతో కలవాలంటారని.. కాంగ్రెస్ వచ్చి కలవాలంటాడని.. అధికారం కోసం ఎంతకైనా దిగజారే స్వభావం బాబుది అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు దమ్ము - ధైర్యం ఉంది కాబట్టే ఒంటరిగా పోటీచేస్తున్నాడని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలను విమర్శిస్తున్నారని.. 365 రోజులు మీరు అసెంబ్లీలోనే ఉండి జీతాలు తీసుకుంటున్నారని అని మండిపడ్డారు. చంద్రబాబు టైం అయిపోయిందని.. చంద్రబాబు దగ్గరున్న ఊరకుక్కలతో ఎంత మొరిగినా లాభం లేదన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే శంకుస్థాపనల పేరిట హడావుడి చేస్తున్న బాబుకు అసలు పాలన చాతకాదని.. ఓడిపోవడం ఖాయమని నాని స్పష్టం చేశారు.

× RELATED వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ.. రచ్చ మొదలైనట్టే!