మెగాస్టార్ 152కి నయన్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా అవకాశం కావాలంటే అంత సులువా?  బాస్ రేంజుకు తగ్గ భామ దొరకాలి కదా?  ఆయన వయసుకు .. ఆయన క్యాలిబర్ కి తగ్గ హీరోయిన్ దొరకడం అంత సులువా? అందుకే ఆచితూచి వేచి చూడాల్సిన సన్నివేశం ఉందట. అయితే ఎంతగా వేచి చూసినా మెగా బాస్ రేంజుకు తగ్గ హీరోయిన్ ని పట్టుకోవడం కష్టంగా ఉందన్నది మన మేకర్స్ చెబుతున్న మాట. పరిమితంగా ఇప్పటికి ఉన్న మొహాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని దర్శక నిర్మాతల ఆవేదన అని తెలుస్తోంది.

మెగాస్టార్ కి ఇప్పుడే కాదు.. `ఖైదీ నంబర్ 150` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చినప్పుడే హీరోయిన్ ని  వెతకడం చాలా ఇబ్బంది అయ్యింది. అసలే రీలాంచ్ కోసం మెగా బాస్ ఓ రేంజులో ప్రిపరేషన్ తో ఇండస్ట్రీ హాట్ డిబేట్ కి తెరలేపడంతో ఆయన సరసన ఆ రేంజు భామను వెతకలేక వినాయక్ నానా తంటాలు పడి చివరికి కాజల్ తో అడ్జస్ట్ అయ్యాడు. ఆ తర్వాత `సైరా-నరసింహారెడ్డి` విషయంలోనూ సేమ్ సీన్ రిపీటైంది. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ హీరోయిన్లను వెతుక్కోవడం తప్ప కొత్త భామల్ని తెచ్చుకోలేకపోయారు సురేందర్ రెడ్డి. నరసింహారెడ్డి భార్యామణి పాత్రకు నయన్తోనే ఫిక్సయిపోవాల్సి వచ్చింది. నయనతార టాలీవుడ్లో ఉన్న అగ్రహీరోలందరికీ ఏకైక ఆప్షన్ గా మారింది అందుకే.

ఎలాగోలా 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి` కోసం సీనియర్ భామలపైనే ఆధారపడ్డారు సరే.. ఈసారైనా 152 కోసం మెగాస్టార్ సరసన ఓ కొత్త భామను వెతికి పట్టుకుంటారా? అంటే.. మళ్లీ నయన్ పైనే ఆధారపడాల్సి వచ్చిందన్నది కొరటాల సన్నిహితులు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 152వ సినిమా కోసం కొరటాల శివ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత వెంటనే సెట్స్ కెళ్లే ప్రాజెక్టు ఇదేనన్న మాటా వినిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే కొరటాల కథానాయికల్ని వెతికాడట. కొత్త భామల్ని బాస్ కోసం తెచ్చినా ఆయన రేంజుకు సరిపోదని వెనక్కి తగ్గిన కొరటాల తిరిగి తమన్నా - నయన్ పేర్లు పరిశీలించాడట. చివరికి ఆ ఇద్దరిలోనూ నయన్ కే జాక్ పాట్ తగిలిందని తెలుస్తోంది. కేవలం నయన్కి మాత్రమే ఆ సత్తా ఉందని చిరు - కొరటాల భావించి ఫైనల్ చేశారట. సైరా తర్వాత వెంటవెంటనే బాస్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసింది నయన్. చిరు - నయన్ పెయిర్ ఏ రేంజులో వర్కవుటైందో `సైరా` చూసి మెగాఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. కొరటాల నిర్ణయం సరైనదా.. కాదా? అన్నది చెప్పాల్సింది వాళ్లే కదా!
× RELATED అందుకే మెగాస్టార్ అనేది