ఓటేయడానికి వస్తే పూలమాల వేసి తీసుకెళ్లారు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు పెద్ద సంఖ్య లో ఓటేశారు. ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఏ ఇబ్బందీ లేకుండా వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులను ఇంటి దగ్గర్నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘమే ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. పోలింగ్ బూత్ లలో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో వీల్ చైర్లలో వచ్చిన దివ్యాంగులు అసౌకర్యం లేకుండా ఓటేశారు.

వరంగల్ లో పోలింగ్ సిబ్బంది దివ్యాంగులకు పూలబొకేలతో స్వాగతం పలికారు. వారు ఓటేసేందుకు సహాయం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు సాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వలంటీర్లను నియమించారు. వలంటీర్లే దివ్యాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకొచ్చి ఓటేయించారు. దివ్యాంగులు ఓటేసిన తర్వాత వలంటీర్లు వారిని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చారు.

అందరికీ అందుబాటులో ఎన్నికలు అన్న నినాదంతో ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఈసారి దివ్యాంగుల పోలింగ్ శాతం పెరిగింది. ఈసీ చేసిన ఏర్పాట్లపై దివ్యాంగులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సౌకర్యాలు కల్పించలేదని గుర్తుచేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.
× RELATED సుమ కాళ్లు మొక్కిన రానా ఎందుకంటే..!