బాబు డబుల్ స్టాండర్డ్స్..బట్ట బయలు చేసిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరును ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఎండగట్టారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్ జగన్ ఓ ట్వీట్ లో బాబు తీరును ఎండగట్టారు. తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ఓట్ల కోసం ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు భారీ ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు తమ రాష్ట్రం అంశంలో...నిరుద్యోగుల విషయంలో దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు వైఖరిపై జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇండ్లు కట్టామని - పరిశ్రమలు పెట్టామని - అభివృద్ధిలో దూసుకపోతున్నామని చంద్రబాబు లేనిపోని కూతలు కోశారని ఎద్దేవా చేశారు. మా ఉద్యోగాలేవని తిరుపతిలో అడిగిన డీఎస్సీ అభ్యర్థులతో ‘ తమాషాగా ఉంది మీకు... నిరుద్యోగులు ఒక్కరి కోసం పని చేయటానికి సిద్ధంగా లేము... తమాషా ఆటలు ఆడకండి... బీ కేర్ ఫుల్ ’ అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారని మండిపడ్డారు. విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తే విరుచుకుపడడం దుర్మార్గమని అన్నారు. 


× RELATED బాబు కష్టం..బూడిదలో పోసినట్టేనా?