'నోటా' కొండ ఓటేశాడా ఇంతకీ?

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. లేదంటే దుర్వినియోగం అవుతుంది. ఓటు వేయకపోతే కనీసం నోటా అయినా నొక్క ండి అంటూ క్లాసులు పీకాడు. నేను కేసీఆర్‌కి  వీరాభిమానిని గులాబీ పార్టీకే ఓటేస్తాను. కేటీఆర్‌తో ఎంతో అనుబంధం ఉంది. రాస్కోండి పబ్లిక్‌గా చెబుతున్నా అంటూ బీరాలు పోయాడు. కానీ అంత చెప్పిన మన హీరోగారు ఎక్కడ? ఈరోజు తెలంగాణలో ఎంతో కీలకమైన ఎలక్షన్ జరిగింది కదా? ఇంతకీ ఓటేసాడా.. లేదా? .. ప్రస్తుతం దేవరకొండ అభిమానుల్లో సందేహమిది.

మన స్టార్లంతా పోలింగ్ బూత్ లలో దర్శనమిచ్చారు. ఓటేసేందుకు విచ్చేసిన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలో నిలబడి మరీ ఓటేశారు. ఓటు హక్కును సద్వినియోగం  చేసుకోవాల్సిందిగా అందరినీ కోరారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగేందుకు తనకు ఎంతో సపోర్టుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ సైతం ఓట్లు వేశారు. ఓటు వేయమని ప్రజల్ని కోరారు. తాను అభిమానించే కింగ్ నాగార్జున సైతం ఓటు వేసి జనాలను ఓటేయమన్నారు. మరి ఇంతమంది ఇళ్లలోంచి బయటికి వచ్చి ఓట్లు వేసారు. మరి దేవరకొండ ఏమయ్యాడు?

కాలేజ్ రోజుల నుంచే ఓటేస్తున్నానని క్రాస్ రోడ్స్ సమీపంలో నారాయణ కాలేజ్ పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటేసేవాడినని ఇదివరకూ తెలిపారు దేవరకొండ. నైజాం యూత్ మొత్తం తమ ఫేవరెట్ హీరోగా దేవరకొండను భావిస్తున్నారు. తనని ఆదర్శం గా తీసుకుంటున్నారు. అయితే తమ ఐడియల్ హీరో ఓటేసినట్టు ఎక్కడా ప్రూఫ్ దొరకలేదు. తెరాసకు దేవరకొండ ఓటేస్తాడని ఆ పార్టీ నాయకులు భావించారు. మరి అందరికీ హ్యాండిచ్చినట్టేనా? ఇంతకీ దేవరకొండ ఎక్కడ? ప్రస్తుతం అతడు డియర్ కామ్రేడ్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు పలు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. క్షణం తీరిక లేని షెడ్యూల్ ఉంది. ఇటీవల ఎవరికీ ఫోన్ లకు కూడా దొరకడం లేదట. మరి దేవరకొండ ఎక్కడ ఉన్నట్టు ఓటింగ్ వేళ? అంటూ సామాజిక మాధ్యమాల్లో అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

× RELATED బెల్లం కొండ బాబు ఆచితూచి అడుగేస్తాడా?