ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్

సాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌ పై పడింది. రాజస్థాన్‌ - తెలంగాణలో ఇవాళే పోలింగ్ ముగిసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ - మిజోరం ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను జాతీయ మీడియా సంస్థలు విడుదల చేశాయి. టైమ్స్ నౌ - సీఎన్ ఎన్‌ - ఇండియా టుడే - ఏబీపీ న్యూస్‌ - న్యూస్‌ ఎక్స్‌ - ఇండియా టీవీ - సీ ఓటర్స్ - రిపబ్లిక్‌ జన్‌ కీ బాత్‌ వంటి సంస్థలు విడుదల చేసిన రిజల్ట్స్ ఈ విదంగా ఉన్నాయి.

----తెలంగాణ : మొత్తం స్థానాలు 119
టైమ్స్‌ నౌ సర్వే: టీఆర్ ఎస్‌- 66, ప్రజాకూటమి- 37, బీజేపీ- 7 ఇతరులు- 9
రిపబ్లిక్‌ సర్వే: టీఆర్ ఎస్‌ 50-65, ప్రజాకూటమి 38-52
న్యూస్‌ ఎక్స్‌ సర్వే: టీఆర్ ఎస్‌- 57, ప్రజాకూటమి- 46, బీజేపీ- 6, ఇతరులు- 10
సీఎన్ ఎన్‌ సర్వే: టీఆర్ ఎస్‌ 50-65, ప్రజాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14

--- మధ్యప్రదేశ్‌ : మొత్తం స్థానాలు 230

టైమ్స్‌ నౌ సర్వే: బీజేపీ- 126, కాంగ్రెస్‌ కూటమి- 89, బీఎస్పీ- 6, ఇతరులు- 9
ఇండియా టుడే సర్వే: బీజేపీ 102-120, కాంగ్రెస్‌ కూటమి 104-122, బీఎస్పీ 1-3, ఇతరులు 3-8
న్యూస్‌ ఎక్స్‌ సర్వే: బీజేపీ- 106, కాంగ్రెస్‌ కూటమి- 112, ఇతరులు- 12
ఏబీపీ న్యూస్‌ సర్వే: బీజేపీ- 84, కాంగ్రెస్‌ కూటమి- 109, ఇతరులు- 9

- ఛత్తీస్‌ గఢ్‌ : మొత్తం 90 స్థానాలు
టైమ్స్‌ నౌ సర్వే: బీజేపీ- 46, కాంగ్రెస్‌- 35, జేసీసీ కూటమి- 7, ఇతరులు- 2
ఇండియాటుడే సర్వే: బీజేపీ 42-50, కాంగ్రెస్‌ 32-38, జేసీసీ కూటమి 6-8, ఇతరులు 1-3
రిప‌బ్లిక్ సీ ఓట‌ర్ః బీజేపీ- 39, కాంగ్రెస్‌- 46, ఇతరులు- 5

***రాజస్థాన్‌ లో మొత్తం స్థానాలు 200

టైమ్స్‌ నౌ సర్వే: బీజేపీ- 85, కాంగ్రెస్‌ కూటమి- 105, బీఎస్పీ- 2 ఇతరులు- 7,
ఇండియా టుడే సర్వే: బీజేపీ 55-72, కాంగ్రెస్‌ కూటమి 119- 141 ఇత‌రులు 4-11
రిప‌బ్లిక్ స‌ర్వేః బీజేపీ 52-68, కాంగ్రెస్‌ కూటమి 129- 145 ఇత‌రులు 5-11
ఏబీపీ సీఎస్‌డీఎస్ః బీజేపీ 83, కాంగ్రెస్‌ కూటమి 101 ఇత‌రులు 15

---మిజోరంలో మొత్తం 40 స్థానాలు
టైమ్స్‌ నౌ సర్వే: బీజేపీ- 0, కాంగ్రెస్‌ కూటమి- 16, ఎంఎన్ ఎఫ్‌- 18 ఇతరులు- 6
ఇండియా టుడే సర్వే: బీజేపీ - 0, కాంగ్రెస్‌ కూటమి 8-12 ఎంఎన్ ఎఫ్‌-16-20 ఇతరులు- 6
రిప‌బ్లిక్ సీ ఓట‌ర్‌ స‌ర్వేః బీజేపీ 0, కాంగ్రెస్‌ కూటమి 14- 18 ఎంఎన్ ఎఫ్‌ 16-20 ఇతరులు- 6

× RELATED ఎగ్జిట్ పోల్స్ పై హీరో కౌంటర్