మా వ్యక్తిగత విషయాలపై మీ రచ్చ ఎందుకు?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ - అమెరికన్ సింగర్ నిక్ జొనస్ తాజాగా వివాహ బంధంతో ఏకం అయిన విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య వయస్సు తేడా అధికంగా ఉండటంతో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ ను ఎలా ప్రియాంక పెళ్లి చేసుకుంటుంది అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాసిన విషయం తెల్సిందే. వాటిపై ప్రియాంక చోప్రా సీరియస్ అయ్యింది. తమ పెళ్లి విషయంలో మీరు రాద్దాంతం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

తాజాగా మీడియాపై తన వ్యాఖ్యలపై స్పందించింది. తాను అసహనంతో చేసిన వ్యాఖ్యలు కావు పెళ్లి అనేది మా వ్యక్తిగత విషయం అయినప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లుగా కథనాలు రాసే హక్కు లేదు. అందుకే నాకు కోపం వచ్చిందని ఈ సంరద్బంగా పేర్కొంది. త్వరలోనే మీడియా ముందుకు ప్రియాం మరియు నిక్ లు రాబోతున్నారు. ఆ సమయంలో అన్ని విషయాలపై క్లారిటీగా మాట్లాడతారని వారి సన్నిహితులు చెబుతున్నారు.

రాజస్థాన్ కోటలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు మరియు ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఇక ముంబయిలో జరిగిన రిసెప్షన్ లో బాలీవుడ్ మొత్తం కదిలి వచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి ఎంత వైభవంగా జరిగినా కూడా ప్రియాంక చోప్రాపై కొందరు చేసిన ఆరోపణలు మాత్రం ఆమె అభిమానులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

× RELATED 'వెంకీమామ' అన్ని విషయాలపై అధికారిక ప్రకటన