అభిరుచి గల డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్!

'పటాస్' తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ నందమూరి కళ్యాణ్ రామ్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం దక్కలేదు.  అప్పటినుండి డిఫరెంట్ స్టోరీలతో కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నా ఎందుకో అవి ప్రేక్షకులను మెప్పించడం లేదు.  అలా అని నిరాశ చెందకుండా కళ్యాణ్ రామ్ మాత్రం తన వైపునుండి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెడుతూ ఆ సినిమాలపై ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కేవీ గుహన్ దర్శకత్వంలో '118' అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో నటించేందుకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  'ఉయ్యాలా జంపాలా'.. 'మజ్ను' సినిమాలతో విరించి వర్మ మంచి అభిరుచిగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈమధ్యే ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీ..  డిఫరెంట్ హీరో క్యారెక్టరైజేషన్ తో కళ్యాణ్ రామ్ ను మెప్పించడంతో కళ్యాణ్ రామ్ సరే అన్నాడట.

ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తారట.   కళ్యాణ్ రామ్ సీనియర్ డైరెక్టర్లకంటే యంగ్ డైరెక్టర్లతో కలిసి పనిచేసినప్పుడు సక్సెస్ సాధించాడు. మరి విరించి వర్మ కళ్యాణ్ రామ్ కు ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ హిట్ ఇస్తాడేమో వేచి చూడాలి.  ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్తుంది. 
× RELATED Kalyan Ram 118 Movie 4 Days Collections | Nivetha Thomas | Shalini Pandey | i5 Network