ఫోటో స్టొరీ: జూనియర్ శ్రీదేవి అనిపించిందే!

అతిలోక సుందరిగా అందరిచేత నీరాజనాలు అందుకున్న శ్రీదేవి తన కుమార్తె జాన్వీ డెబ్యూ ఫిలిం రిలీజ్ కు మునుపే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.  'ధడక్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తన మొదటి సినిమాతో మంచి మార్కులే తెచ్చుకుంది. తనను హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం చేసిన కరణ్ జోహార్ బ్యానర్లోనే రెండో సినిమా కూడా చేస్తోంది.

సినిమాలతో పాటుగా ఫ్యాషన్ మ్యాగజైన్ల కోసం ఫోటోషూట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈమధ్య 'లాఫిసియాల్' అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇండియా ఎడిషన్ కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. ఇది డిసెంబర్ ఎడిషన్.  బ్లూ కలర్ టాప్ తో పాటుగా డార్క్ బ్లూ కాంబినేషన్ లో స్కర్ట్.. బ్లూ కలర్ టై ని మెడలో వేసుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో సిల్వర్ కలర్లో మెరిసే  డెకరేషన్ పేపర్ ను ఉంచడం తో థీమ్ సూపర్ గా సెట్ అయింది.  జాన్వి తన స్కర్టుని కాస్త లుంగీ టైపులో అలా ఎత్తి పట్టుకుంది.  దీని అల్ట్రా స్టైలిష్ మాస్ అనాలేమో. ఆ యాటిట్యూడ్.. ఎక్స్ ప్రెషన్ అదిరి పోయాయి.  ఒక్కసారి శ్రీదేవి జూనియర్ కదా అని గుర్తుచేసినట్టుంది.

ఇక జాన్వి సినిమా విషయానికి వస్తే కరణ్ జోహార్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న 'తఖ్త్' లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్.. కరీనా కపూర్.. అలియా భట్.. విక్కీ కౌశల్.. అనిల్ కపూర్.. భూమి పెడ్నేకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2020 లో రిలీజ్ అవుతుంది.


× RELATED దారి కనిపించని బాలయ్య దర్శకుడు ?