నల్లపురెడ్డి ఓకే.....నెల్లూరు నుంచే మరో రెడ్డి ..?

నెల్లూరు జిల్లా వైసీపీని వేధిస్తొంది. నస పెడుతోంది. ఒకనాడు చంకనెక్కించుకున నెల్లూరు ఇపుడు బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేస్తోందా అంటే అవును అనే జవాబు వస్తోంది. నెల్లూరు జిల్లాలో పది సీట్లు వైసీపీ గెలుచుకుని స్వీప్ చేస్తే అందులో నుంచి ఏడుగులు మాత్రమే మిగిలారు. ముగ్గురుని వైసీపీ తానే సస్పెండ్ చేసి తమ వారు కాదని చెప్పేసింది.

ఇక ఈ ఏడుగురి  ఎమ్మెల్యేల   మీద కూడా ఎన్నో అనుమానాలు ఆరోపణలు ప్రచారాలు గాసిప్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీని వీడిపోతారు అని గత రెండు రోజులుగా సోషల్ మీడియాను ప్రచారం ఊపేసింది. అయితే దానికి ఆయన వివరణ ఇచ్చేశారు. చచ్చేవరకూ జగన్ తోనే అని స్పష్టం చేశారు.

అయితే ఇపుడు నెల్లూరు జిల్లాలోని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2014 2019 ఎన్నికల్లో రెండు సార్లు వైసీపీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కావలి ఎమ్మెల్యే సీటు విషయంలో వైసీపీ చేసిన సర్వేలలో ఆ పార్టీ గ్రాఫ్ బాగులేదని వచ్చింది అంటున్నారు.

ఎమ్మెల్యే పనితీరు మీద కూడా అధినాయకత్వం అసంతృప్తిగా ఉందని వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ కి టిక్కు పెట్టవచ్చునని అంటున్నారు. అంటే ఒక విధంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారనే లెక్క  వేస్తున్నారు. ఈ నేపధ్యంలో కావలి ఎమ్మెల్యే రాం కుమార్ రెడ్డి తన ఫ్యూచర్ చూసుకుంటారు అని అంటున్నారు.

మరి ఆయనకు వైసీపీ చెక్ చెప్పేస్తే వేరే పార్టీ నుంచి అయినా టికెట్ కోసం ప్రయత్నం చేయాలి కదా. అందుకే ఆయన పక్క చూపులు అని ప్రచారం సాగుతోంది. ఇక వైసీపీ ఇంటర్నల్ సర్వేలు కాదు కానీ అనేక ఇతర సర్వేలలో కూడా కావలి వైసీపీకి దెబ్బేస్తుంది అని వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో కొత్త అభ్యర్ధిని ఇక్కడ దించితే గెలుపు అవకాశాలు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు.

అదే కనుక నిజం అయితే కావలి ఎమ్మెల్యే కూడా ఫ్యాన్ నీడలో ఉక్కబోత అంటూ వేరే పార్టీల వైపు చూడడం తొందరలోనే జరుగుతుంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏడాది క్రితం  నుంచి జగన్ వర్క్ షాప్ పేరిట తరచూ చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే నివేదికలను వెల్లడిస్తూ వస్తున్నారు. దాంతో వారికి టికెట్లు దక్కవని అర్ధం అవుతోంది అంటున్నారు.

అలాగే మంత్రివర్గ విస్తరణ రెండు సార్లు జరిగినా సీనియర్లకు చోటు దక్కలేదు. వారు సైతం లోలోపల రగిలిపోతున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో అలాంటి వారి జాబితా బాహాటంగానే ఉంది. అయితే వీటిని పట్టుకుని మీడియా హల్ చల్ చేస్తోందా సోషల్ మీడియాలో రచ్చ అవుతోందా లేక టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం వైసీపీలో పాతిక నుంచి నలభై మంది దాకా టికెట్లు దక్కకుండా పోతారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న విషయం.

దాంతో వారిని అధినాయకత్వం వేరే విధంగా న్యాయం చేస్తామని చెప్పినా నమ్మకం కలగడం లేదా. లేక వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు అన్న కలవరం ఎక్కడైనా ఉందా అన్నది తెలియడం లేదు కానీ ఏడాది ముందు నుంచే ఇలా పక్క చూపులు అంటే వైసీపీ లో ఆలోచించుకోవాల్సి ఉంటుందనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED పోలవరం ప్రాజెక్టు సమీపంలో స్టార్ హోటల్.. సీఎం జగన్ రియాక్షన్ ఇదే!
×