హిట్ కాంబో రిపీట్ అయి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన హీరో మరియు ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వారిద్దరి కాంబినేషన్ లో హిట్ తర్వాత రాబోతున్న సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.. కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం కాస్త తక్కువ ఆసక్తి ఉంటుందనే చెప్పాలి.

దర్శకులు హీరోయిన్స్ తో కంటిన్యూగా వర్క్ చేసినా కూడా ఎక్కువ హడావుడి కనిపించదు. కానీ ఈసారి మాత్రం ఆ హడావుడి కనిపిస్తుంది త్రివిక్రమ్ వరుసగా మూడవ సారి పూజా హెగ్డే తో కలిసి మహేష్ బాబు సినిమా లో వర్క్ చేస్తున్నాడు.

అలవైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ అదే హీరోయిన్ ని మహేష్ బాబు సినిమాకు రిపీట్ రిపీట్ చేస్తున్న కారణంగా సినీ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు హిట్ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు భీష్మ సినిమాతో సక్సెస్ సొంతం చేసుకున్న వెంకీ కుడుముల.. రష్మిక మందన కాంబో మరోసారి నితిన్ సినిమాలో రిపీట్ కాబోతుంది. వీరి మొదటి సినిమా ఛలో ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. నితిన్ తో వీరు చేయబోతున్న సినిమా సక్సెస్ తో హ్యాట్రిక్ దక్కించుకోబోతున్నారు.

ఇక తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం జవాన్ లో నయనతార కీలక పాత్రలో కనిపించబోతోంది. గతంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో నయనతార నటించిన చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

కనుక జవాన్ సినిమాతో మరోసారి అట్లీ.. నయనతార కాంబో సక్సెస్ అవ్వడం ఖాయం అంటున్నారు. మొత్తానికి హిట్ డైరెక్టర్ హీరోయిన్ కాంబో రిపీట్ అయి సెంటిమెంటు వర్కౌట్ అయ్యి ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవుతాయా అనేది చూడాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఓం రౌత్ చేసిన తప్పు ఇదే..!
×