వైసీపీలో సజ్జల సంక్షోభం అచ్చం టీడీపీలో లక్ష్మీపార్వతి లాగానే!

వైసీపీలో కీలక నాయకుడి గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సంక్షోభం సృష్టించేలా ఉన్నారని. ఆ పార్టీ రెబల్ నాయకుడు ఎంపీ రఘురామకృష్ణరావు. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ హాట్ కామెంట్స్ చేశారు. దీనిని ఆయన 1990లలో టీడీపీలో తలెత్తిన సంక్షోభంతో పోల్చారు. అప్పట్లో ఎన్టీఆర్ భార్యగా ఉన్న లక్ష్మీ పార్వత్రి పార్టీ నేతలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించడం. పార్టీని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారనే కారణంగా. మెజారిటీ టీడీపీ నాయకులు బయటకు వచ్చి. చంద్రబాబుకు మద్దతు గా నిలిచారు.

ఆసమయంలో వైశ్రాయ్ హోటల్లో సమావేశమై. టీడీపీలో విభజన ఏర్పడి. చంద్రబాబుకు దన్ను గా నిలిచారు. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీలోనూ వచ్చే అవకాశం ఉందని ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం మొగ్గదశలోనే ఉందని. దీనిని ముదరకుండా చూసుకోవాలని ఆయన సీఎం జగన్ కు సూచించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆర్ ఆర్ ఆర్ నాటి టీడీపీ పరిణామాలను పూస గుచ్చినట్టు వివరించారు.

లక్ష్మీ పార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తిందన్నారు. "సజ్జల రామకృష్ణారెడ్డి మన పార్టీలో లక్ష్మీపార్వతి లా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితి చేయి దాటకముందే ఆయనను పక్కన పెట్టకపోతే మరింత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగడం ఖాయంగా కనిపిస్తోంది" అని హెచ్చరించారు.

ఇప్పటి కీ మెజారిటీ శాసనసభ్యులు సీఎం జగన్ ని ప్రేమిస్తున్నారచెప్పారు. అయితే ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి దినపత్రిక ఎడిటోరియెల్ డైరెక్టర్ గా పనిచేసిన  సజ్జల రామకృష్ణారెడ్డి కి రిపోర్టు చేయాలనడం సరికాదన్నారు. నిజానికి సజ్జల ప్రజల నుంచి గెలిచిన నాయకుడు కాదని.. ఎమ్మెల్యేలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజల మధ్యకు వెళ్లి. ఖర్చు పెట్టుకుని. ప్రచారం చేసుకుని గెలిచారని. అలాంటి వారిని రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని సజ్జలకు రిపోర్టు చేయాలని చెప్పడం. ఎమ్మెల్యేల మనోభావాలను దెబ్బతీయడం కాదా? అని ప్రశ్నించారు.

ఆన్ ప్రశ్న సరైందే!

ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన నలుగురు క్రాస్ ఓటింగ్ చేశారన్న వైసీపీ అధిష్టానం.. పై ఆనం స్పందించిన తీరును ఆర్ ఆర్ ఆర్ ప్రశంసించారు. క్రాస్ ఓటింగ్ జరిగిందని  ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ఆనం ప్రశ్నించిన తీరు సరైందేనని  చెప్పారు. "వైసీపీ కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. వైసీపీ ఏర్పాటు చేయాలని అనుకున్న నాటి నుంచి ఈ కుటుంబం జగన్కు  వెన్నెముకగా ఉన్నారు.  మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణకు ఓటు వేశానని అందుకే ఆయన గెలిచారని చెబుతున్నారు. అటువంటి వ్యక్తిని అంతర్గత నివేదికల ఆధారంగా సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుచేటు." అని ఆర్ ఆర్ ఆర్ దుయ్యబట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇలా కూడా దోచేస్తారు జాగ్రత్త!
×