మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు మార్చి 27వ తేదీన ఘనంగా వైభవంగా జరిగాయి. మంగళవారం రోజు హైదరాబాద్ లో జరిగిన ఈ బర్త్ డే పార్టీకి చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా యంగ్ అండ్ డైనమిక్ హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా వచ్చారు. ముఖ్యం తెలుగు సినీ రంగంలోని చాలా మంది ప్రముఖులు వచ్చారు.
అందులో దర్శకధీరుడు రాజమౌళి మంచు లక్ష్మి రానా దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ అడవి శేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా.. కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి వచ్చింది. అలాగే ఇటీవలే ఓ ఇంటివాడైన మంచు మనోజ్ తన భార్య భూమా మోనికతో కలిసి చెర్రీ పుట్టిన రోజు సంబురాల్లో సందడి చేశారు.
వీరితో పాటు కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అయింది. ఎందుకంటారా... కన్నడ దర్శకుడు నర్తన్ రామ్ చరణ్ కు కథ వినిపించాడని... చరమ్ కూడా ఓకే చెప్పాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఇవన్నీ రూమ్స్ అని అంతా అనుకున్నారు.
కానీ తాజాగా రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో నర్తన్ కనిపించడంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం నిజమని తెలుస్తోంది. కేవలం కన్నడ డైరెక్టర్ యే కాకుండా తమిళ ప్రొడ్యూసర్ కేవీన్ కూడా ఈ పార్టీకి వచ్చారు. చెర్రీకి దగ్గరైన స్నేహితులతో పాటు సినీ ప్రముఖులు అందరూ వచ్చినప్పటికీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించకపోవడం గమనార్హం.
చెర్రీతో అంత క్లోజ్ గా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించకపోవడంతో అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే షూటింగ్ వల్లే తారక్ పుట్టిన రోజుకు రాలేడని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి షూటింగ్ లో పాల్గొనక పోయినప్పటికీ... పుట్టిన రోజు వేడుకలకు హాజరు కానట్లు తెలుస్తోంది. కారణం ఏంటో మాత్రం ఎవరికీ తెలియదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.