వైరల్ పిక్ : ఆ ప్రత్యేక పూజలు సినిమా ఛాన్సులు కోసమా?

సినీ పరిశ్రమలో అదృష్ణమనే అంశం ఎప్పుడు హాట్ టాపిక్ నే. రాత్రికి రాత్రే స్టార్ అయిన వారిని చూసి ఆశతో ఎర్రబస్సెక్కి పరిశ్రమికొచ్చిన వారెందరో? అందుకే ఇప్పటికీ టాలీవుడ్ చుట్టూ జాతక రాయుళ్లు తిరుగుతుంటారు. మీ భవిష్యత్ చెబుతామంటూ కృష్ణానగర్..ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో తరుచూ జ్యోతిష్యులు చక్కెర్లు కొడుతుంటారు. జ్యోతిష్యుల మాటలు ఎంత వరకూ ఫలించాయన్నది పక్కనబెడితే! తాజాగా నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు చేస్తోన్న ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

అమ్మడు ఉపావాసంతో  ఈ పూజలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉదాయన్నే  తలస్నానం చేసి ముస్తాబై  గులాబీ రంగు దుస్తుల్లో  ఇలా కనిపించారు. దేవుడి పటాలపై పువ్వులు జల్లుతూ దర్శనమిచ్చారు. ఆ పక్కనే సోషల్ మీడియా ఫేమస్ వేణు స్వామి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ  పూజలు జరుగుతు న్నాయి. ఈయన నెట్టింట ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.

సెలబ్రిటీ-రాజకీయ నాయకులు భవిష్యత్ ఎలా ఉంటుందని జాతకాలు  చెప్పి వెలుగులోకి వచ్చారు. నిక్కచ్చిగా..నిర్మోహమాటంగా మాట్లాడటం వేణు స్వామి ప్రత్యేకత. నేను  చెప్పిందే జరుగుతుంది? జరిగే చెబుతాను! అంటూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో  తాజాగా ఆయన సమక్షంలోనే నిధి అగర్వాల్ పూజలు చేయించడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

సినిమాల్లో అవకాశాల కోసం నిధి అగర్వాల్ ప్రత్యేకంగా   రాజ శ్యామల అనే  పూజ చేయించినట్లు తెలు స్తోంది.  గతంలో రష్మిక మందన్న కూడా ఆయనతో పూజలు చేయించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా నిధి అగర్వాల్ కూడా అదే పంథాలో కనిపించడం ఇంట్రెస్టింగ్.

నిధి అగర్వాల్ కెరీర్ సంగతి చూస్తే 'సవ్యసాచి' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అటుపై 'మిస్టర్ మజ్ను'-'ఇస్మార్ట్ శంకర్' లో నటించింది.  ఇస్మార్ట్ శంకర్ తో  బాగా పాపులర్ అయింది.

కానీ ఆ సక్సెస్ ని తదుపరి కొనసాగించలేకపోయింది.  అయినా సరే  పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు'లో మెయిన్ లీడ్ కి ఎంపికైంది. ఇది ఓ రకంగా లక్కీ ఛాన్సే. ఇప్పుడా లక్ ని తదుపరి కూడా కొనసాగించాలని  భావిస్తుంది. ఇంతలో ప్రత్యేక పూజలతో నెట్టింట సంచలనమవుతుంది. మరి ఈ పూజలు సినిమా అవకాశాల కోసమా?  కుటుంబ క్షేమం కోసమా? అన్నది తెలియాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED బాబి-గోపీచంద్ మధ్య పోటాపోటీ!
×