సంచలనం : ఎమ్మెల్సీ కవితకు ఈడీ లేఖ

ఎమ్మెల్సీ కవిత విచారణలో ఈడీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇప్పటికే పలు మార్లు కవితను విచారించిన ఈడీ ఆమె వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఇక కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ తాజాగా లేఖ రాయడం సంచలనమైంది.

ఈడీ విచారణ వేళ కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో ఈడీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది.

ఇక కవిత ఈ ఫోన్లు తెరిచే కార్యక్రమానికి వెళ్లడం లేదని.. బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఈడీ ఆఫీసుకు వెళుతున్నారని సమాచారం.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్ ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్ బిజినెస్ కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడీకి కవిత పంపారు.

ఆ తర్వాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్ ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్ లో మీడియాకు చూపించారు.  

ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళుతున్నట్టు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని చార్జీషీట్ లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో  విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా ఈడీ వద్ద జమ చేస్తున్నట్టు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తుకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.  ఈ క్రమంలోనే ఫోన్లను తెరిచే సమయంలో కవిత ఉండాలని ఈడీ జేడీ తాజాగా లేఖ రాసినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED క్రికెట్ బుకీ.. అతడి కుమార్తెను పోలీసులకు పట్టించిన ఆ డిప్యూటీ సీఎం సతీమణి
×