సినీ జనాల అభిరుచి మారింది మారుతూ వస్తోంది. గొప్ప సినిమా మాత్రమే సరిపోదు అంతే గొప్పగా చెప్పాలి. అప్పుడే అది ప్రేక్షకులకు నచ్చుతుంది. మంచి సినిమా తీశామని మూవీ మేకర్స్ అనుకుంటే సరిపోదు ఆ మంచి మూవీ ఎంత మంచిగా నడిపించామనేది కూడా ముఖ్యమే. ఇది మరోసారి రుజువు అయింది తాజాగా. సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మూవీ రంగమార్తాండ. మంచి పాజిటివ్ టాక్ అందుకుంది.
పేరుమోసిన దర్శకుడు పేరు మోసిన నటులు అప్పటికే మంచి హిట్ అందుకున్న స్టోరీ. అయినా రంగమార్తాండకు కలెక్షన్లు లేవు. ఒకటీ రెండు చోట్ల తప్పించి ఎక్కడా పెద్దగా ఆడిన దాఖలాలు కనిపించడం లేదు. మరి రంగమార్తాండ సినిమా బాలేదా నెగెటివ్ టాక్ వచ్చిందా అంటే అదీ కాదు. ఎందుకంటే బలగం మూవీ కంటే ఒకింత ఎక్కువ ప్రశంసలే దక్కాయి. కానీ కలెక్షన్లలో అది కనిపించడం లేదు.
రియాలిటీలో రంగమార్తాండ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మరోవైపు కమెడియన్ వేణు యెల్దండి తెరకెక్కించిన బలగం మూవీ మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ డైరెక్టర్ కు ఇదే మొదటి సినిమా నటీనటులు కూడా పెద్దగా తెలిసిన వారు కాదు. చాలా వరకు కొత్త వారే. కథ కూడా కొత్తదే. కానీ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
కట్ చేస్తే సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్లు కూడా జోరుగా వస్తున్నాయి. ఒకవైపు ఓటీటీలో విడుదల అయినప్పటికీ.. ఇప్పటికీ థియేటర్లలో ఫుల్ జోష్ తో నడుస్తోంది. ఈ రెండింటి నుండి తెలుస్తుంది ఏమిటంటే.. జనాలు కొత్త సినిమాలను రానెస్ ఉన్న సినిమాలను సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టే సినిమాలను ఇష్టపడుతున్నారు. కానీ ఆ కథ చెప్పే తీరు కూడా బాగుంటేనే కలెక్షన్ల రూపంలో వారి ప్రేమను చూపిస్తున్నారు.
రంగమార్తాండ సినిమా విడుదలకు ముందు పలు స్పెషల్ షోలో వేశారు. సినీ ప్రముఖులకు విశ్లేషకులు సినిమా చూపించారు. రంగమార్తాండ చూసిన వారంతా సినిమా బాగుంది కానీ కలెక్షన్లు రావని చెప్పేశారట. ఆ మాటలే ఇప్పుడు నిజం అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.