అమరావతికి 'ఆ నలుగురు' జై కొట్టబోతున్నారా ?

అధికారపార్టీలో సస్పెన్షన్ వేటుపడిన నలుగురు ఎంఎల్ఏలు ఇకనుండి అమరావతికి మద్దతుగా తమ వాయిస్ ను వినిపించాలని డిసైడ్ అయ్యారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి అమారవతికి జై కొట్టారని సమాచారం. శ్రీదేవి మూడురోజుల క్రితం మీడియాతో మాట్లాడుతు అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దంటు కుటుంబంతో కలిసి నినాదాలిచ్చారు. ఇకనుండి రెగ్యులర్ గా అమరావతికి మద్దతుగా పోరాటాలు చేస్తానని కూడా చెప్పారు.

ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా అమరావతి నినాదాన్ని ఎత్తుకున్నారు. న్యాయస్ధానం టు దేవస్ధానం యాత్ర జరిగినపుడు అమరావతి జేఏసీ వాళ్ళకి కోటంరెడ్డి నెల్లూరులో బస వసతి సౌకర్యాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

అప్పటినుండే ఎంఎల్ఏ వ్యవహారం ఏదో తేడాగా ఉందనే అనుమానాలు పెరిగిపోయాయి. సో ఇపుడు బహిరంగంగానే అమరావతికి జై కొట్టారు. ఇక ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా తొందరలోనే మీడియా సమావేశం పెట్టి అమరావతికి మద్దతు ప్రకటించబోతున్నట్లు సమాచారం.

వీళ్ళ నలుగురు అమరావతి ప్రాంతంలో పర్యటనలు చేయటం ద్వారా రాజధాని ప్రాంతంలోని జనాల మద్దతు సంపాదించాలని అనుకుంటున్నారట. అందుకనే తొందరలోనే ఈ నలుగురు భేటీ జరగబోతోందని సమాచారం.

అంటే అమరావతికి జైకొట్టడం ద్వారా తెలుగుదేశంపార్టీకి జిందాబాద్ చెప్పబోతున్నట్లే అనుకోవాలి. ఆనం కోటంరెడ్డికి ఇప్పటికే టీడీపీలో టికెట్లు ఖాయమయ్యాయనే ప్రచారం తెలిసిందే. ఇక శ్రీదేవి మేకపాటి వ్యవహారంలోనే క్లారిటి రావాలి.

ఇదే సమయంలో వీళ్ళంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు రెడీ అవుతున్నారనే ప్రచారం పెరిగితోంది. ఇదే సమయంలో అందరు కాదని కేవలం శ్రీదేవి మాత్రమే రాజీనామా చేసి అమరావతి మద్దతుదారులతో మళ్ళీ గెలవాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది.

అయితే వీళ్ళు అంత సాహసం చేస్తారా అనే అనుమానాలున్నాయి. మరో ఏడాదిలో షెడ్యూల్ ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు రాజీనామాలు చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదేమో. కేంద్ర ఎన్నికల కమీషన్ గనుక ఉపఎన్నికలు అనవసరమని భావిస్తే వీళ్ళు నిండా ముణిగిపోతారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED మిషన్ రాయలసీమ... పెద్ద టెండరే పెట్టేసిన లోకేష్
×