తెలుగు దేశం.. జూనియర్ ఎన్టీఆర్.. ఈ రెండింటికి విడదీయరానీ బంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నిజానికి వారసత్వంగా జూ.ఎన్టీఆర్ కే దక్కాలి. కానీ మధ్యలో నారా చంద్రబాబు చేతుల్లోకి పోయింది.
అయినా కూడా ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ తెలుగుదేశం వెంటనే నడుస్తోంది. 2009లో జూ.ఎన్టీఆర్ తెలుగుదేశం తరుఫున ప్రచారం కూడా చేశాడు. ఇక బాలయ్య ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.అయితే జూ.ఎన్టీఆర్ మాత్రం కాస్త తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారన్న చర్చ సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక ఆశ్చర్యపరిచే పిక్ తాజాగా బయటకొచ్చింది. అది ఓ టీడీపీ యువ నాయకుడు.. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిన ఫొటో వైరల్ అయ్యింది.
టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేశాడు. అస్మిత్ రెడ్డి తో పాటు అయన భార్య కూడా పార్టీ లో పాల్గొన్నారు
మార్చి 26వ తేదీన ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీలో ఇది కనిపించి ఉండవచ్చని అంటున్నారు. జేసీ ఇంటి నుండి వచ్చిన అస్మిత్ రెడ్డి జంట ఎన్టీఆర్ మరియు అతని భార్యతో కొంత సంతోషకరమైన సమయాన్ని గడుపినట్టుగా ఫొటో ఉంది.
టీడీపీ యువనేత అస్మిత్ రెడ్డికి నందమూరి హీరోకి మధ్యన ఇంత సాన్నిహిత్యం ఉందా? అని ఈ ఫొటో చూశాకే అందరికీ అర్థమైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ శ్రేణులు ఈ చిత్రాలను షేర్ చేస్తున్నారు. అస్మిత్ రెడ్డి గతంలో 2019 ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జేసీ సోదరుల ఇద్దరు కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీ తో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి . టాలీవుడ్ తోనే కాదు బాలీవుడ్ బడా స్టార్స్ తో కూడా వీరికి మంచి అనుబంధం ఉంది అని అంటుంటారు .
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.