అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ ఐకాన్

ఒకప్పుడు సినీ హీరోల అభిమానుల సందడి రోడ్లమీద థియేటర్ల బయట కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ల నేపథ్యంలో సోషల్ మీడియాలోనే హడావుడి కనిపిస్తోంది. తమ హీరోల పుట్టినరోజులు ఏదైనా స్పెషలకేషన్స్ సినిమా ఓపెనింగ్లు సినిమా అప్డేట్ల విషయంలో రకరకాల టాగులు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసే పనిలో ఉంటున్నారు అభిమానులు.

ఇక తాజాగా అల్లు అర్జున్ అభిమానులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో గ్లోబల్ అనే పదం ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఆ గ్లోబల్ స్టార్ అనే పదం తమ హీరోది అంటే తమ హీరోది అంటూ రచ్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్తడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే టాగ్ ట్విట్టర్ లో ట్రేండింగ్ అయింది. అదేవిధంగా మహేష్ బాబు 28వ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఆ టాగ్ కూడా ట్రెండ్ అయింది.

అయితే అసలు ఏమాత్రం సంబంధం లేని విధంగా అల్లు అర్జున్ పేరు కూడా ఈ ట్రెండ్స్ లోకి వచ్చింది.

గతంలో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు కానీ పుష్ప సినిమా నుంచి ఆయన ఐకాన్ స్టార్ గా మార్చుకున్నారు. నిన్న గ్లోబల్ ఐకాన్ అల్లు అర్జున్ అనే పేరుతో ఒక టాగ్ సృష్టించి దానిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్విట్టర్లో వైరల్ చేయడం కనిపిస్తోంది. నిజానికి అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో సాధించింది ఏమీ లేదు.

రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటే ఆర్ఆర్ఆర్ వల్ల కాస్త గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. కానీ పుష్ప సినిమా కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ గ్లోబల్ పదాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ హీరోకి కావాలనే అన్వయించుకున్నారని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఓం రౌత్ చేసిన తప్పు ఇదే..!
×