అఖిల్ అక్కినేని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అఖిల్ అనే సినిమాతో 2015లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు.. మరో మూడు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. తాజాగా ఆయన ఏజెంట్ అని సినిమాలో హీరోగా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.
తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్ వినూత్నంగా ప్లాన్ చేశారు.
ప్రమోషన్లలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కూడా భాగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కోసం రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల నుండి వారిని ఆహ్వానిస్తున్నారు.
నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మధ్య కొలాబరేషన్ అనేది సినీ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అని దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల ఏజెంట్ సినిమా భారీ సంచలనాన్ని సృష్టిస్తుందని అనుకుంటున్నారు.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి రాగూల్ హెరియన్ థారుమాన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా... నవీన్ నూలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.