ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

లెజెండరీ సినీ దర్శకుడు కళాపతస్వి విశ్వనాథ్ మరణంతో యావత్ సినీ రంగం తీవ్ర విషాధలో మునిగింది. 92 ఏళ్ల వయసు కల్గిన కే విశ్వనాథ్ తెలుగు సినిమా స్థాయినీ గుర్తింపును ఉన్నత శిఖరాలకు చేర్చారు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్త అభిమానుల గుండెల్ని తొలిచేస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గురువారం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం అందరికీ తెలిసిందే.  

అయితే ఈయన అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశానవాటికలో ముగిశాయి. అభిమానులు అశ్రునయనాల మధ్య ఫిల్మ్ నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయనను కడసారి చూసేందుకు చాలా మంది వచ్చారు. ప్రజలు అభిమానులతో పాటు ప్రముఖులు కూడా తరలివచ్చారు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ పార్థివ దేహానికి అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులు అర్పించారు.

1930 ఫిబ్రవరి 19వ తేదీన కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వానాథ్ జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు. తెలుగు చిత్ర రంగంలో విశ్వనాథ్ ది విలక్షణ పాత్ర. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎనలేని పేరును తీసుకొచ్చి పెట్టిన ఈయన.. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన రోజే ఆయన మృతి చెందడం సినీ ప్రేమికులకు మరింత బాధను కల్గిస్తోంది.

అయితే విశ్వనాథ్ టాలెంట్ కు 1992లో పద్మ శ్రీ పురస్కారం లభించింది. 2016లో ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించడం గమనార్హం. సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రకటించిన వంద భారతీయ ఉత్తమ చిత్రాల్లో విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సాగరసంగమం చిత్రాలు ఉండడం చెప్పుకోదగ్గ విషయాలు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నిజంగా లేడీ పవర్ స్టార్... ఇది సాయి పల్లవి రేంజ్
×