కళ్యాణ్ రామ్ కోసం మరోసారి ఎన్టీఆర్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీ ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కు జోడీగా అషికా రంగనాథ్ నటించారు. కళ్యాణ్ ఈ సినిమాలో మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ జై లవకుశ తరహాలో ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూల్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "కొత్తదనంతో నేను ఇంతవరకూ చేసిన సినిమాలను మీరంతా ఆదరిస్తూనే వచ్చారు. అలాగే అమిగోస్ సినిమాను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా విషయంలో నేను ఒక మాటను బలంగా చెప్పగలను. థియేటర్ కి వచ్చినవారెవరూ నిరాశతో తిరిగెళ్లరు. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని ఈ సారి కూడా నిలబెట్టుకుంటాను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ వస్తున్నాడు. ఆ రోజున మిగతా విషయాలు మాట్లాడుకుందాము" అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం వింటుంటాం. వాళ్లలో ఒక ముగ్గురు కలుసుకుంటే ఎలా ఉంటుంది? అనే కథాకథనాలతో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు.

ఇప్పటికీ విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. అలానే వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్గా నిలిచిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 2023లో వస్తోన్న మూడో చిత్రం కావున సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఇక పోతే ఈ సినిమాల బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయి గాని పాటను రీమిక్స్ చేయడం విశేషం. ఈ పాటకి వేటూరి సుందర రామ మూర్తి లిరిక్స్ విషయం తెలిసిందే. ఎన్నో రాత్రులొస్తాయి పాటను గతంలో ఇళయరాజా స్వరపరచగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర సంయుక్తంగా ఆలపించారు. ఇప్పుడీ గీతాన్ని జిబ్రాన్ సరికొత్తగా రీమిక్స్ చేశారు. అప్పట్లో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ పాటలో కళ్యాణ్ రామ్ లుక్స్ సిక్స్ ప్యాక్ ఆకట్టుకుంటున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×