కోట్లు కొల్లగొడుతున్న ‘కిమ్’ శిష్యులు.. క్రిప్టో సంపద హాంఫట్..!

ఉత్తర కొరియా అధినేత కిమ్ స్వీయ రక్షణ పేరుతో అణ్వస్త్ర ప్రయోగాలు.. క్షిపణి ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాకుండా ఉత్తర కొరియాలో వివాదాస్పద నిర్ణయాలకు ఆయన కేరాఫ్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే. అయితే అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో కిమ్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశంపై ఐక్య రాజ్య సమితితోపాటు పలు దేశాలు ఆంక్షలు విధించాయి.

కరోనా ఎఫెక్ట్.. ఆర్థిక మాంద్యం కారణంగా ఉత్తర కొరియా సైతం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ అణ్వస్త్రాయుధాలను ఉత్తర కొరియా చేస్తూనే ఉంది. అయితే ఈ ప్రయోగాలకు అయ్యే ఖర్చు మాత్రం కిమ్ శిష్యులు(హ్యకర్లు) క్రిప్టో కరెన్సీలో రూపంలో సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం వీరంతా బ్లాక్ చైన్ టెక్నాలజీని పకడ్బందీగా వినియోగించుకుంటూ వేల కోట్లను తస్కరిస్తున్నారని తెలుస్తోంది.

గతేడాది ఉత్తర కొరియా హ్యాకర్లు క్రిప్టో ఎక్స్ చేంజ్ లోకి చొరబడి  1.7 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 13.9వేల కోట్లు) దొంగిలించినట్లు డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ ‘చైన్ ఎనాలసిస్’ పేర్కొంది. అంతకుముందు ఏడాది సైతం 429 మిలియన్ డాలర్లతో కొట్టేసిన సొమ్ముతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం.

కాగా గత ఏడాది మొత్తం 3.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్లు దోపిడీ చేయగా ఇందులో 44 శాతం ఉత్తర కొరియా హ్యాకర్లు చేసినట్లు చైన్ ఎనాలసిస్ వెల్లడించింది. ఐరాస సహా పలు దేశాల ఆంక్షలను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగాల నిధుల కోసం క్రిప్టో నేరాలకు పాల్పడుతుందని ఐరాస పరిశోధక బృందాలు చెబుతున్నాయి.

గతేడాది హరిజన్ బ్రిడ్జ్ అనే బ్లాక్ చైన్ నెట్ వర్క్ లో 100 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలు చోరికి గురికాగా ఇది ఉత్తర కొరియాలోని లాజరస్ గ్రూప్ పనేనని గత నెలలో అమెరికా (ఎఫ్బీఐ) ధృవీకరించింది. ఉత్తర కొరియాకు డాలర్లు చేరకుండా అమెరికా ఆంక్షలకు పెట్టడంతో కిమ్ క్రిప్టో కరెన్సీని వినియోగించడం మొదలు పెట్టాడు. అయితే వాటిని తయారు చేసుకునే స్తోమత లేకపోవడంతో ఆ దేశానికి చెందిన హ్యాకర్లు ఇలా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఆ మహిళ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
×