రాందేవ్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి ఏకంగా..!

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త రాందేవ్ బాబా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యోగా గురువుగా.. పతంజలి గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడిగా ఆయన అందరికీ సుపరిచితమే. నిత్యం సెలబ్రెటీలతో యెగా పాఠాలు చెబుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకునే యోగా గురువు రాందేవ్ తాజాగా మరో కాంట్రవర్సీకి తెరలేపారు.

రాజస్థాన్లో ని బార్మర్ జిల్లాలో రాందేవ్ పర్యటించారు. ధర్మ పూజారి మహరాజ్ మందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందూ మతాన్ని ఇతర మతాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీరోజు ఐదుసార్లు నమాజ్ చేసే ఇస్లాం నుంచే అత్యధికులు ఉగ్రవాదులుగా మారారని చెప్పుకొచ్చారు.

ఒక ముస్లిం ఉగ్రవాదిగా మారినా సరే ఖచ్చితంగా అతడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తాడని బాబా రామ్ దేవ్ బాబా అన్నారు. ఐదుసార్లు నమాజ్ చేసి ఎలాంటి పాపమైన చేయొచ్చని ముస్లింలు భావిస్తారని అన్నారు. ఇస్లాం అంటే కేవలం రోజూ ఐదు సార్లు నమాజ్ చేయడమేనని వారు అనుకుంటున్నారని ఆయన అనడం సంచలనంగా మారింది.

క్రైస్తవంలో చర్చికి వెళ్లి కొవ్వొత్తి వెలిగించడానికి ప్రాధాన్యత ఉందన్నారు. ఆ మతం ప్రకారం ఏసు క్రీస్తు విగ్రహం ముందు నిల్చుని కొవ్వొత్తి వెలిగిస్తే అన్ని పాపాలు పరిహారం అవుతాయని తెలిపారు.

క్రైస్తవులు శిలువ గుర్తును మెడలో ధరిస్తారని.. కొన్నిరకాలు దుస్తులు వారి కోసమే తయారవుతాయని వ్యాఖ్యానించారు. ఇలాంటివి హిందు మతంలో లేదని వీటిని హైందవం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని ఆయన అన్నారు..

తాను ఈ వ్యాఖ్యలను ఎవరినీ కించపరచడానికి చెప్పడం లేదని ఆయా మత గ్రంథాల్లో పేర్కొన్న విషయాలు చెబుతున్నానని ఆయన స్పస్టం చేశారు. ఒక వర్గం వారు ప్రపంచాన్ని ముస్లింలోకి మారుస్తామని.. మరో వర్గం వారు క్రైస్తవంలోకి మారుస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చెప్పడమే తన ఉద్దేశ్యమని రాందేవ్ బాబా స్పష్టం చేశారు. ఆయా మతగ్రంథాలు వారికి ఏం చెబుతున్నా.. హిందూమతంలో ఇలాంటి వాటికి తావులేదన్నారు.

తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని మన సనాతన ధర్మం చెబుతోందన్నారు. ఉదయాన్నే దేవుని నామస్మరణ చేసి యోగాసనాలు వేయాలని సూచిస్తుందన్నారు. సన్మార్గంలో ఎలా నడచుకోవాలి.. సత్ప్రవర్తనను ఎలా అలవరచుకోవాలనేది హిందూ ధర్మం నేర్పు తుందన్నారు. ధర్మాన్ని రక్షించండి.. హింసకు.. అబద్ధాలకు ప్రజలు దూరంగా ఉండాలని హైందవం సూచిస్తుందని రాందేవ్ బాబు అన్నారు. అయితే ఆయన ఇతర మతాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేలా కన్పిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... తెరపైకి క్షుద్రపూజలు!
×