షాక్ ఇస్తున్న అజిత్ విజయ్ రెమ్యునరేషన్స్

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా ఇమేజ్ తో ఇండియన్ వైడ్ తమ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సినిమాల కోసం తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసారు. తెలుగులో ఇప్పటికే స్టార్ హీరోలు 80 నుంచి 100 కోట్ల మధ్య రిమనరేషన్ తీసుకుంటున్నారు. సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ ఉన్నాడు.

ప్రస్తుతం అతను 150 కోట్ల వరకు తన సినిమాలకు చార్జ్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. అలాగే రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలుగా ఉన్న ఇళయ దళపతి విజయ్ హీరో అజిత్ కుమార్ల రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సంక్రాంతి సందర్భంగా విజయ్ వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అజిత్ తునివు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ తో ప్రారంభమైన కలెక్షన్స్ పరంగా హిట్ గా నిలిచాయి.

కేవలం ఇద్దరు హీరోలకున్న చరిష్మా కారణంగానే సినిమాలు హిట్టు బొమ్మలుగా మారి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఇప్పుడు రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగా పెంచినట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు 80 నుంచి 90 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ ఇద్దరు హీరోలు తమ కొత్త సినిమాలుకు ఏకంగా 100 కోట్లకు పైగా చార్జ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ లోకేష్ తో చేస్తున్న సినిమా కోసం 130 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా కోలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట. అలాగే అజిత్ కూడా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం 100 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇండస్ట్రీ రింగ్ మాస్టర్లు రాజకీయాలతో విసుగెత్తాను!-పీసీ
×