
సూపర్ స్టార్ మహేశ్ బాబు, పూజ హెగ్డే జంటగా-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందున్న సినిమా ssmb 28. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబో నుంచి చిత్రం రావడం వల్ల ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. దీని కోసం అభిమానులతో పాటు సినీ నటులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మరణించడం సహా పలు కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది.
ఇదే సమయంలో నిన్న దర్శకుడు త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి క్రికెట్ ఆడుతున్నావ్ ఏందయ్యా, షూటింగ్ కంప్లీట్ చేయ్ త్వరగా అంటూ ఆ వీడియోపై కామెంట్లు కూడా వచ్చాయి. మరి కొంతమంది ఈ వీడియోను లైక్స్, కామెంట్స్‌తో ట్రెండ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మహేశ్‌కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
ఇందులో మహేశ్ కూడా ఓ ఫామ్‌హౌస్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించారు. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తోంది. ఇందులో మహేశ్ ఓ చిన్న బ్యాట్‌తో క్రికెట్ ఆడుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు దీన్ని ట్రెండ్ చేస్తూ తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఏం మహేశ్ నీ బ్యాట్ ఇంత చిన్నదా అంటూ ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఇక ssmb28 విషయానికొస్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబో అతడు, ఖలేజాకు పని చేయడం వల్ల ఎస్ఎస్ఎంబీ 28పై భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీలలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోని ఈ సినిమాకు అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి రూ.100కోట్లకు కొనుగోలు అయ్యాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.200కోట్ల వరకు జరిగిందని తెలిసింది.
దీంతో మొత్తంగా రూ.300కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు పోయాయని సమాచారం. ఇక ఈ చిత్రం బ్రెక్ ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లు ఉండొచ్చని అంచనా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.