క్రేజీ సినిమాల కోసం ఇతర హీరోల సినిమాలని వెనక్కి నెట్టడం తెలిసిందే. ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీగా వున్న సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక క్రేజీ మూవీ కోసం ఇద్దరు హీరోలని వెనక్కి తగ్గమంటున్నారు. దీంతో ఫిబ్రవరిలో రావాలనుకున్న సినిమాలు కాస్త వెనక్కి తగ్గాయి. అయితే అనుకున్న సినిమా అనుకున్న డేట్ కి రావడానికి సిద్ధంగా లేకపోవడం మళ్లీ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఇతర హీరోల సినిమా రిలీజ్ లు ఇప్పుడు గందరగోళంగా మారినట్టుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ హిస్టరీలోనే మునుపెన్నడూ జరగని విధంగా కరోనా కారణంగా 'RRR' నుంచి పలు క్రేజీ పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్ లు ఐదారు సార్లు మార్చడం తెలిసిందే. క్రేజీ సినిమాలకు సరైన సమయం కాదని కొన్ని థియేటర్లు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రీ ఓపెన్ కాలేదని మరి కొన్ని సినిమాలు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ కారణంగా నైట్ కర్ఫ్యూ కొనసాగుతోందని మరి కొన్ని క్రేజీ మూవీస్ ఎప్పటి కప్పుడు రిలీజ్ డేట్ లని మార్చడం తెలిసిందే.
ఇక గత ఏడాది ఆగస్టులోనూ చైత థాంక్యూ నితిన్ 'మాచర్ల నియోజక వర్గం'ల కారణంగా కొన్ని సినిమాల రిలీజ్ డేట్ లు పలు దఫాలుగా మారడం తెలిసిందే. అప్పట్లో రిలీజ్ డేట్ ల విషయంలో థియేటర్ల విషయంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పలు క్రేజీ సినిమాల రిలీజ్ ల విషయంలోనూ అదే తరహా గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి నెలలో చిన్న సినిమాల నుంచి 'శాకుంతలం' వంటి పాన్ ఇండియా సినిమాల జాతర వుంటుందని ప్రకటించారు. ఫిబ్రవరి 3 నుంచే సినిమాల జాతర మొదలైంది. రైటర్ పద్మభూషణ్ సందీప్ కిషన్ 'మైఖేల్' సినిమాలు 3న విడుదలయ్యాయి. ఇక 4న సీతార వారి 'బుట్టబొమ్మ' రాబోతోంది. ఆ తరువాత ఫిబ్రవరి 17న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'దాస్ క ధమ్కీ' సీతారలో ధనుష్ నటించిన 'సార్' వస్తాయని ఆల్ రెడీ డేట్ లు ఫిక్స్ చేశారు.
అయితే ఈ రెండు సినిమాల ఫైనల్ చేసుకున్న ఫిబ్రవరి 17నే సమంత 'శాకుంతలం'ని రిలీజ్ చేయాలని గుణ్ శేఖర్ అండ్ టీమ్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఈ రెండు సినిమాల్లో విశ్వక్ సేన్ 'దాస్ క ధమ్కీ' ని మార్చికి పోస్ట్ పోన్ చేశారు. కానీ ధనుష్ 'సార్' రిలీజ్ ని మాత్రం మార్చలేదట. ఫైనల్ గా 'శాకుంతలం' రిలీజ్ డేట్ దిల్ రాజు కు నచ్చకపోవండంతో గుణ శేఖర్ ఫిబ్రవరి 17 రిలీజ్ పై యూటర్న్ తీసుకున్నాడట. ఇక ధనుష్ 'సార్' ఫిబ్రవరి 17కే రానుండటంతో కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ'ని ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేసుకోమన్నారట.
ఈ విషయం తెలిసి విశ్వక్ సేన్ 'దాస్ క ధమ్కీ' రిలీజ్ డేట్ ని మళ్లీ మార్చాలనుకోవడం లేదట. మార్చికే ఫిక్సయ్యారట. కానీ ధనుష్ 'సార్'మాత్రం ఫిబ్రవరి 17కే ఫిక్సయ్యాడని తెలిసింది. ఇలా వస్తుందనుకున్న సినిమా రాకుండా రాదనుకున్న సినిమా రిలీజ్ కి రెడీ అయిపోవడం ప్రేక్షకులతో పాటు మార్కెట్ వర్గాలని కూడా తీవ్ర గందరగోళానికి గురి చేస్తోందని పలువురు వాపోతున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఈ నెల 10న రిలీజ్ కి రెడీ అవుతున్న కల్యాణ్ రామ్ 'అమిగోస్' అన్నట్టుగానే అనుకున్న రోజునే థియేటర్లలోకి వస్తుందా? లేక మళ్లీ డేట్ మారుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.