ఐదేళ్ల తర్వాత ఫ్రెండ్ అనటమా? రూ.25కోట్ల పరిహారం ఇప్పించండి

ఎమోషన్ తో ఆడుకోవటమా? అంటూ ఆవేశంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు సింగపూర్ కు చెందిన యువకుడు ఒకరు. తన గర్ల్ ఫ్రెండ్ తనను ఫ్రెండ్ అని మాత్రమే అంటోందని.. తాను లవ్ చేయలేదంటోందని.. ఇదెక్కడి న్యాయం అంటూ కోర్టు మెట్లు ఎక్కిన ఒక కుర్రాడి కథ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఒక కథనాన్ని సింగపూర్ కు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ పబ్లిష్ చేసింది. ఈ కథనం పలువురిని ఆకర్షిస్తోంది.

సింగపూర్ కు చెందిన కషిగన్ అనే యువకుడు. అతనికి నోరాతాన్ అనే యువతితో స్నేహం ఉంది. అది కాస్తా స్నేహం స్థాయి నుంచి తర్వాతి లెవల్ కు వెళ్లిపోయిందని.. ఆమె తన ప్రేయసిగా అతను భావించాడు. వీరిద్దరు తొలిసారి 2016లో కలుసుకున్నారు. వీరి పరిచయం చాలా త్వరగా స్నేహం రూపం దాల్చటం.. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారిందన్నది కషిగన్ వాదన. అయితే.. ఆమె మాత్రం అతడ్ని స్నేహితుడిగా మాత్రమే చూసింది. అతను మాత్రం ఆమెను ప్రేమికురాలిగా చేసింది.

అతడు తన ప్రేమను వ్యక్తపర్చగా.. తాను అతన్ని స్నేహితుడిగా మాత్రమే చూసినట్లు చెప్పి.. ప్రేమ వ్యవహారం తనతో కుదరదని చెప్పింది. దీంతో కలత చెందిన కషిగన్ ఆమె నుంచి తనకు న్యాయం జరగాలని కోర్టును ఆశ్రయించాడు. ముందు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తనతో స్నేహంగా ఉండి.. ఐదేళ్ల తర్వాత ప్రేమ కాదని అంటోందని.. తనను మానసికంగా డిస్ట్రబ్ చేసినందుకు ప్రతిగా రూ.25 కోట్ల పరిహారాన్ని తనకు ఇప్పించాలని కోరాడు.

ఈ కేసును టేకప్ చేసిన పోలీసులు అతడికి.. ఆమెకు కౌన్సెలింగ్ చేశారు.  కషిగన్ తో జీవితం తనకు సుఖంగా.. సౌకర్యవంతంగా ఉంటుందని తాను భావించటం లేదని.. అందుకే అతన్ని తాను స్నేహితుడిగా మాత్రమే చూస్తున్నట్లుగా తేల్చి చెప్పింది. దీనికి కషిగన్ మాత్రం ఆమె తన జీవితాన్ని.. తన ప్రొఫెషనల్ లైఫ్ ను దారుణంగా దెబ్బ తీసినట్లుగా పేర్కొంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. తాను పోలీసుల్ని ఆశ్రయిస్తే అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని.. అందుకే తనకు రూ.25 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు.  ఆమె కారణంగా తాను విపరీతమైన వేదనకు గురయ్యానని.. తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. తన పరువు..

ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని చెప్పారు. అందుకే తనకు భారీ పరిహారం ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో.. ఈ పిటిషన్ పై ఈ నెల తొమ్మిదిన విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. మరి.. తుది తీర్పు ఏ తీరులో ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడా? రాహుల్ పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
×