స్పీడు పెంచడానికి రౌడీ స్టార్ బిగ్ ప్లాన్ రెడీ!

విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు భిన్నంగా భారీ డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూవీతో పాన్ ఇండియా తో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపుని దక్కించుకోవాలని కఠోరంగా శ్రమించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు 'లైగర్' మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత విజయ్ దేవరకొండ 'ఖుషీ' మూవీలో నటిస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా సమంత కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తను మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కి దూరంగా వుంటూ వస్తోంది. తన కారణంగా 'ఖుషీ' షూటింగ్ డిలే అవుతున్న కారణంగా విజయ్ దేవరకొండ మరో సినిమాని ప్రారంభించలేకపోతున్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫాన్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 'ఖుషీ' మూవీ షూటింగ్ మొదలైతే కానీ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కలేని పరిస్థితి. తాజాగా సామ్ కోలుకోవడం 'సీటాడెల్' ప్రాజెక్ట్ లో నటిస్తుండటంతో 'ఖుషీ'ని త్వరలోనే మొదలు పెట్టే అవకాశం వుంది.

ఇప్పటికే ఆలస్యం కావడంతో విజయ్ దేవరకొండ 'ఖుషీ'తో పాటు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కోసం టెర్రిఫిక్ ప్లాన్ ని రెడీ చేసుకున్నాడట. 'ఖుషీ' ప్రాజెక్ట్ సామ్ కారణంగా ఆలస్యం అయిన నేపథ్యంలో ఈ మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరి పీరియాడిక్ యాక్షన్ డ్రామాని కూడా సైమల్ టెనియస్ గా పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నాడట. ఇందు కోసం పక్కా ప్లాన్ ని కూడా రెడీ చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గౌతమ్ తిన్ననూరి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ కాప్ గా కనిపించబోతున్నాడు. ఇందు కోసం ఇప్పటికే రెడీ అయినా విజయ్ దేవరకొండ పెద్దగా శ్రమ పడకుండానే ఈ మూవీతో పాటు 'ఖుషీ' షూటింగ్ ని కూడా ఒకే సమయంలో పూర్తి చేయాలనుకుంటున్నాడట. త్వరలోనే 'ఖుషీ' షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా పట్టాలెక్కబోతోందని తెలిసింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×