అదానీ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు

ఆసియా కుబేరుడు అదానీ పేరు ఇటీవల మారుమోగుతోంది. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరిగాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే అదానీ గ్రూప్ షేర్లు పడిపోయాయి. అయితే ఇవన్నీ తనపై ఉన్న ద్వేషంతోనే ఆరోపణలు చేశారని షేర్లలో అవకతవకలు పాల్పడడానికి ఆధారాల్లేవని అదానీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. మరోవైపు అదానీ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి వాటిల్లో శ్రద్ధ చూపిన ప్రభుత్వం అదానీ విషయంలో అంతా గప్ చుప్ గా ఎందుకు ఉంటుందన్న చర్చ సాగుతోంది.

ప్రపంచ కుభేరుల స్థానంలో అదానీ పేరు సరిగ్గా వారం కిందట టాప్ 10లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానం నుంచి 17కు చేరింది. అందుకు ఆయనకు చెందిన కంపెనీల షేర్లు పడిపోవడమే. అదానిపై ఆరోపణలు వచ్చిన తరువాత ఆయన షేర్లు 100 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయాయి. తాజాగా 20 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా బరిలోకి వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజేస్ ఎఫ్ ఫీవోను కూడా అదానీ గ్రూపు రద్దు చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదానికి ఇచ్చిన రుణాల వివరాలను  ఆర్ బీఐ కోరింది. ఆర్బీఐ రంగంలోకి దిగడంతో అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సైతం అప్రమత్తమయ్యాయి. కొన్ని బ్యాంకులు తనఖా పెట్టుకున్న షేర్లు విలువ తగ్గిపోతుండడంతో ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాయి.

కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడంపై పలు విమర్శలు దారి తీస్తోంది. ఇప్పటికే విజయ్ మల్యా నీరవ్ మోదీ లాంటి వాళ్లు బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు అదానీ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే అదే జరుగుతుందని ప్రతిపక్షాల రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ నాయకులు అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పక్కా ఎవిడెన్స్ దొరికితే అదానిపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు.

అయితే అదానీ షెర్లలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ షేర్లను భారీగా విక్రయించినట్లు తెలుుస్తోంది. మరికొందరు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అదీన గ్రూప్ సభ్యులు చెబుతున్నా.. హిండెన్ బర్గ్ ఎవిడెన్స్ ను చూసి చాల మంది ఆందోళన చెందుతున్నారు. ఏదీ ఏమైనా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని వీడి అదానీ విషయంలో ప్రకటన చేయకపోతే రిమార్క్ పడే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఆ మహిళ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
×