అసోంలో బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఎక్కడో ఒకచోట నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో ఇటీవల జరిగిన.. కొన్నేళ్ల క్రితం జరిగిన బాల్య వివాహాలను తీవ్రంగా పరిగణించాలని అసోం సీఎం హేమంత్ బిస్వా అధికారులకు సూచించారు.
ఈ విషయంలో పోలీసులు ఎవరికి భయపడొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు మైనర్లను పెళ్లి చేసుకున్న గుట్టుచప్పుడు కాకుండా కాపురం చేస్తున్న మృగాళ్లకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. బాల్యవివాహాలపై సీఎం అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు 4వేల బాల్య వివాహాలకు సంబంధించిన చిట్టాను బయటకు తీశారు.
సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి బాల్య వివాహాలు చేసుకున్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోనే గతంలో బాల్య వివాహాలు చేసుకున్న మగాళ్లను అరెస్టు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాల్య వివాహాలు చేసుకున్న పురుషులతో పాటు బాల్యవివాహాలు చేయించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
గతంలో బాల్యవివాహాలు చేసుకొని ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు వచ్చిన వారిని సైతం విడిచిపెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బాల్య వివాహాలకు పాల్పడిన వారందరిపై ఫోక్సో కేసు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఏ సమాజాన్ని మేము లక్ష్యంగా చేసుకోబోమని తెలిపారు.
కులం.. మతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో బాల్య వివాహాలు అరికట్టడమే లక్షంగా పెట్టుకున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అమ్మాయిల హక్కులను రక్షిస్తామని.. బాల్య వివాహాలు చేసుకున్న వారు ఎవరైనా సరే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటీ నుంచి అసోంలో బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టం అమలులోకి వస్తుందని అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ వెల్లడించారు.
ఇటీవలి కాలంలో అసోంలో బాల్య వివాహాల వల్ల శిశు మరణాల రేటు బాగా పెరిగింది. దీంతో ఆడ పిల్లలను ప్రభుత్వం కష్టాల కూపంలోకి నెట్టి వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దృష్టి సారించిన అసోం సీఎం రాష్ట్రంలో బాల్యవివాహాలు సగటున 31 శాతంగా ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేబినెట్ సమావేశం నిర్వహించిన బాల్య వివాహాలు చేసుకున్న వారికి అరెస్టు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలకు ఎవరూ పాల్పడిన చట్టం నుంచి తప్పించుకోలేరని తనదైన శైలిలో సీఎం వార్నింగ్ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.