వారసుడు 19 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ వారసుడు(తమిళంలో వారిసు)తో మంచి హిట్ అందుకున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయినా విజయ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సంక్రాంతి బరిలో నిలిచిన విజయ్ మూవీ.. మంచి లాభాలతో దూసుకుపోతుంది. ద్విభాషా చిత్రంగా వచ్చిన వారిసు మంచి కలెక్షన్లను సాధించింది.

ఇళయ దళపతి విజయ్ సినిమా వారిసు రిలీజుకు ముందే రూ.137.90 కోట్ల బిజినెస్ చేసింది. విజయ్ కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా జరిగింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ తొలి రెండు మూడు రోజులు సినిమా మంచి వసూళ్లు చేసింది. ఇక 16 రోజుల కలెక్షన్ల విషయాలు చూస్తే నైజాంలో రూ.5.47 కోట్లు సీడెడ్ లో రూ.2.36 కోట్లు ఉత్తరాంధ్రలో రూ. 2.37 కోట్లు ఈస్ట్ రూ. 1.15 కోట్లు వెస్ట్ రూ. 84 లక్షలు గుంటూరు రూ. 1.01 కోట్లు కృష్ణా రూ. 1.02 కోట్లు నెల్లూరులో రూ. 70 లక్షలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14.92(రూ.26.90 గ్రాస్) వసూళ్లు సాధించింది. ఇక్కడ మూవీకి బ్రేక్ ఈవెన్ రూ. 15 కోట్లు కాగా వారసుడు బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు ఆర్జిస్తోందనే చెప్పాలి.

ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే తమిళనాడులో రూ. 127.95 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో రూ.27.45 కోట్లు కర్ణాటక రూ. 11.90 కోట్లు కేరళ రూ. 11.90 కోట్లు మిగతా ప్రాంాతల్లో రూ. 84.45 కోట్లు బిజినెస్ చేసింది వారసుడు. మొత్తం వరల్డ్ వైడ్ గా వారసుడు మూవీ రూ. 280.30 కోట్లు (రూ.143.02 కోట్ల షేర్) ఆదాయం సాధించింది.

వారసుడు సినిమా ఇప్పటి వరకు రూ.137.90 కోట్ల మేర బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడానికి రూ.139 కోట్ల కావాల్సి ఉంది. ఇప్పటి వరకు వారసుడు మూవీ రూ.4.02 కోట్ల లాభాలు ఆర్జించింది.

తెలుగులో ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రాగా.. అటు తమిళంలోనూ ఇద్దరు అగ్ర కథానాయకులు సినిమాలు తెగింపు వారసుడు వచ్చాయి. ఇక్కడ వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ సాధించగా అక్కడ వారసుడు మంచి టాక్ తో లాభాల్లో దూసుకుపోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED చరణ్ బర్త్ డేలో ఆస్కార్ విజేతలకి మెగా సన్మానం!
×