గుంటూరులో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్… ఏంటంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలు ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే థియేటర్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సురేష్ బాబు దిల్ రాజు అల్లు అరవింద్ కి తెలుగు రాష్ట్రాలలో సొంతంగా థియేటర్స్ ఉన్నాయి. వారి సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ఆయా థియేటర్స్ లో బ్లాక్ చేసి రిలీజ్ చేస్తారు. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఆ నలుగురు ఆధిపత్యంలో ఉందనే విమర్శలు కొంత మంది చిన్న నిర్మాతలు చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బడా నిర్మాతలతో పాటు హీరోలు కూడా థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టి మల్టీప్లెక్స్ చైనింగ్ థియేటర్స్ లో భాగం అవుతున్నారు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి థియేటర్స్ పేరుతో మల్టీప్లెక్స్ నడుపుతున్నాడు. వీటిని మరింత విస్తరించే ప్లాన్ లో కూడా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్ కూడా అమీర్ పేటలో సత్యం థియేటర్ ప్లేస్ లో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది చివరిదశకి వచ్చింది. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎంటర్ అయ్యింది.

వీరు గుంటూరులో ఐదు స్క్రీన్స్ తో పెద్ద మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఏఎంబి స్థాయిలోనే దీనిని భారీగా నిర్మించే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

మల్టీప్లెక్స్ లో అయితే టికెట్ రెట్లు ఎక్కువగా పెట్టుకోవడానికి ఛాయస్ ఉంటుంది. తద్వారా కలెక్షన్స్ కూడా గట్టిగానే వస్తాయి. ఫీనిక్స్ మాల్ కాంప్లెక్స్ లో ఈ మల్టీప్లెక్స్ ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది.

ఫీనిక్స్ మాల్ టూరిజం హాట్ స్పాట్ గా గుంటూరులో ఉండబోతుంది. ఇప్పుడు దీనిలోనే ఎంటర్టైన్మెంట్ మల్టీప్లెక్స్ ని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ కాంప్లెక్స్ లో టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని కూడా భాగస్వామ్యంగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే ఇంకో వ్యక్తి కూడా మైత్రీతో కలిసి ఆ కాంప్లెక్స్ కోసం పెట్టుబడి పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×