బండ్లన్న బాధ వెనకున్న రీజన్ ఏంటీ?

పవర్ స్టార్ పవన్కల్యణ్ అంటే బండ్ల గణేష్ కు వీరాభిమానం. ఈశ్వరా పవరేశ్వరా.. పవనేశ్వరా.. నా దేవరా'.. అంటూ పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్ లలో బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పవన్ సినిమా ఫంక్షన్ అంటే బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కాల్సిందే.. మైక్ పట్టాల్సిందే. తన స్పీచ్ కోసం అభిమానులు యమ క్రేజీగా ఎదురు చూస్తుంటారు. పవన్ సినిమా ఫంక్షన్ లో ఎంత మంది మాట్లాడిన బండ్ల స్టేజ్ ఎక్కడి మాట్లాడితేనే అభిమానులకు అదో తృప్తి.

తను పవన్ కు ఇచ్చే ఎలావేషన్ లు వింటూ అభిమానులే కాకుండా సెలబ్రిటీలు సైతం బండ్లన్న స్పీచ్ ని ఎంజాయ్ చేస్తూ మనసారా నవ్వుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. బండ్ల గణేష్ ఈవెంట్ లో లేడంతో ఫ్యాన్స్ ఫీలయ్యే వారు. అంతగా బండ్ల గణేష్ స్పీచ్ లకు పవన్ ఫ్యాన్స్ ఎడిక్ట్ అయ్యారు. అయితే సీన్ మారింది. గత కొంత కాలంగా పవన్ ఫంక్షన్ లకు బండ్ల గణేష్ కనిపించడం లేదు. రక రకాల కారణాలు సోసల్ మీడియాలో ఇప్పటి వరకు వూరల్ అవుతూనే వున్నాయి.

త్రివిక్రమ్ కారణంగానే తనని పవన్ కల్యాణ్ దూరం పెడుతున్నాడని ఆ కారణంగానే పవన్ ఫంక్షన్ లలో బండ్ల గణేష్ కనిపించడం లేదనే కామెంట్ లు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి.

దీనిపై బండ్ల గణేష్ నేరుగా స్పందించకపోయినా ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం తెలిసిందే. ఇదిలా వుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ లని పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే.

'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని సోమ వారం లంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ నేఫథ్యంలో సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ లు వైరల్ గా మారాయి. 'మంచి వాడు ఎప్పుడూ మొండిగా నే ఉంటాడు ఎందుకంటే వాడికి నటించడం రాదు కాబట్టి విజయం అనేది ఆలస్యంగా లభించే ఓటమి.. ఓటమి కూడా ఆలస్యంగా లభించే విజయం ఓటమి ముగింపు కాదు.. విజయం శాశ్వతం కాదు.

ఉన్నది ఉంటుంది లేనిది ఎప్పుడూ ఉండదు దేనీని పట్టి ఉంచుకోవాలి దేనీని విడిచి పెట్టాలో తెలిసిన వాడే అసలైన మేధావి. అంటూ బండ్ల గణేష్ వరుస పోస్ట్ లు పెట్టాడు. ఇవి గనించిన అభిమానులు నీ బాధ ఏంటి అన్నా కొంచెం చెప్పరాదు అని కొంత మంది 'ఓజీ'కి ఇన్విటేషన్ లేదు బ్రో అంటూ రి కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. బండ్ల బాధ వెనకున్న రీజన్ ఇదేనా? .. తను ప్రారంభోత్సవానికి వెళ్లలేకపోయాననే బండ్ల గణేష్ ఇలా ట్వీట్ లు చేస్తున్నాడా? అని అభిమానులు గుస గుస లాడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నిజంగా లేడీ పవర్ స్టార్... ఇది సాయి పల్లవి రేంజ్
×