పఠాన్ ఓటీటీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

ఇప్పుడు బాలీవుడ్ 'పఠాన్' ఫీవర్తో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా... బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల సునామీ కురిపిస్తోంది. షారుఖ్ హీరోగా దీపికా పదేకొణె హీరోయిన్గా నటించిన ఈ మూవీ మొదటి రోజు ఒక్క హిందీ బెల్ట్లోనే 55 కోట్ల రూపాయల వరకూ నెట్ కలెక్సన్లను వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య అత్యంత భారీ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

ఈ సినిమా డే 1 నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో షారుఖ్ అభిమానులు మాత్రమే కాదు... బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చాలా రోజుల తర్వాత వచ్చిన విజయాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చితం..  ఆదివారం నాటికి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్లకు  పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. బాద్షా స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కి మరోసారి చూపిస్తోంది ఈ సినిమా.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటి  హక్కులను ప్రముఖ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏప్రియల్ 25 2023 న ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం.

అయితే తాజాగా ఇంకో విషయం బయటకు వచ్చింది. షారుక్ పఠాన్ సినిమా ఓటీటీలో విడుదల ఆలస్యం అవుతుంది అని సమాచారం. ఎందుకంటే పఠాన్ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లోనే ఉంచాలి అని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఈ కలెక్షన్స్ జోరు ఇలాగే సాగితే ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ. ఈ చిత్రాన్ని యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించాడు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×