దిమ్మతిరిగేలా పఠాన్ కలెక్షన్లు.. 5 రోజుల్లో ఎంతంటే?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇండియన్ రా ఏజెంట్గా నటించిన తాజా చిత్రం 'పఠాన్'. దీపికా పదుకొణె హీరోయిన్. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను సాధిస్తూ వావ్ అనిపిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపిస్తోంది. రోజుకో వంద కోట్లు చెప్పున ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్ చూసి అభిమానులు ఇండస్ట్రీ వారికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఐదు రోజుల్లో రూ.500కోట్లకు పైగా వసూళ్లను సాధించంది. అలా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే కాకుండా సరికొత్త సెన్షేషన్ రికార్డులను క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఐదో రోజు ఈ చిత్రం కేవలం హిందీలో రూ.60 నుంచి 65కోట్లు సాధించినట్లు తెలిసింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి గ్లోబల్ బాక్సాఫీస్ ముందు 67.84 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో రూ.555కోట్లు కలెస్ట్ చేసినట్లు తెలిసింది. కేవలం ఇండియాలో రూ.280కోట్లకు పైగా వసూలు చేసిందట. కేవలం ఐదు రోజుల్లో ఆల్టైమ్ టాప్ 4 గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్గా నిలిచింది.

ఇక యూఏఈలో ఫస్ట్ వీకెండ్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. అవెంజర్స్ ఎండ్గేమ్ రూ.5.94మిలియన్ డాలర్స్తో అగ్రస్థానంలో ఉండగా.. పఠాన్ 4.80మిలియన్ డాలర్స్ ఎఫ్ 8 4.64 మిలియన్ డాలర్స్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఇకపోతే పఠాన్.. దేశవ్యాప్తంగా రూ.250 కోట్ల క్లబ్లోకి కేవలం 5 రోజుల్లోనే ప్రవేశించి రికార్డు సాధించింది. కేజీయఫ్ 2.. ఈ మార్క్ను చేరుకోవడానికి 7 రోజులు పడితే.. బాహుబలి2 ఎనిమిది రోజులు దంగల్ టైగర్ జిందా హైకి పది రోజులు పట్టాయి.

స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని రూపొందించారు. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషఇంచారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్కు ప్రేక్షకుల స్టన్ అయిపోయారు. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించి బాలీవుడ్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 32 ఏళ్ల తర్వాత కశ్మీర్లో హౌజ్ఫుల్ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్ మల్టీప్లెక్స్ బృందం తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED వైరల్ పిక్ : ఆ ప్రత్యేక పూజలు సినిమా ఛాన్సులు కోసమా?
×