థమన్ 9 - దేవి 9.. తక్కువైనా అనిరుధ్ టాప్ హిట్స్

సౌత్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ దర్శకులలో టాప్ లో ఉన్నవారు ఎవరంటే వెంటనే తమన్ దేవిశ్రీ ప్రసాద్ ఇక తమిళంలో చూసుకుంటే అనిరుద్ అని చెబుతారు. తమన్ దేవిశ్రీ తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఉంటే అనిరుద్ ఇప్పుడిప్పుడే తెలుగుపై దృష్టిపెడుతున్నాడు. అతని మ్యూజిక్ ఇంతకాలం కోలీవుడ్ కి ఎక్కువ పరిమితం అయ్యింది. అక్కడ నెంబర్ వన్ మ్యూజిక్ దర్శకుడిగా అనిరుద్ కొనసాగుతున్నాడు. దీనికి కారణం తమిళంలో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ అతనితో తమ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

 ఇదిలా ఉంటే గత ఏడాదిలో చూసుకుంటే ఈ ముగ్గురు మ్యూజిక్ దర్శకులలో ఎక్కువ సినిమాలకి సంగీతం అందించింది అంటే దేవిశ్రీ ప్రసాద్ తమన్ అని చెప్పాలి. వీరిద్దరూ చెరో 8 సినిమాలకి సంగీతం సమకూర్చారు. ఇక అనిరుద్ 5 సినిమాలకి మాత్రమే మ్యూజిక్ అందించాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలలో గత ఏడాదిలో గట్టిగా వినిపించ సాంగ్స్ అంటే చెప్పడానికి పెద్దగా ఏమీ లేవని చెప్పాలి రౌడీ బాయ్స్ సినిమాలో ఒక్క సాంగ్ మాత్రం గత ఏడాది ఎక్కువ ట్రెండింగ్ లో నిలిచింది. మిగిలిన సినిమాలలో పెద్దగా ఏవీ మెప్పించలేదు.

అలాగే అన్ని కూడా మినిమమ్ రేంజ్ సినిమాలే కావడం విశేషం. హిందీలో దృశ్యం సినిమా మాత్రం మ్యూజిక్ దర్శకుడిగా అతన్ని మరో యాంగిల్ లో పరిచయం చేసింది. ఇక తమన్ గత ఏడాది 9 సినిమాలకి మ్యూజిక్ అందిస్తే సర్కారువారిపాట గాడ్ ఫాదర్ భీమ్లా నాయక్ పెద్ద సినిమాలు ఉన్నాయి.

అయితే డీజే టిల్లు సినిమాలో సాంగ్స్ సర్కారు వారిపాట సాంగ్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి. మంచి సక్సెస్ ఇచ్చాయి. ఇక అనిరుద్ ఐదు సినిమాలకి సాంగ్స్ అందిస్తే గత ఏడాది టాప్ ట్రెండింగ్ లో ఉన్న మూవీస్ కావడం విశేషం. విజయ్ పాన్ ఇండియా మూవీ బీస్ట్ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. అలాగే తిరు సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

అలాగే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీటితో పాటు శివ కార్తికేయన్ డాన్ మూవీ అలాగే కథవకుల రెండు కాదల్ అనే సినిమా చేశాడు. ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. తక్కువ సినిమాలు చేసిన అనిరుద్ ని మేగ్జిమమ్ అన్ని హిట్ బొమ్మలే.

ఇక తమన్ దేవిశ్రీ ప్రసాద్ సినిమాలు ఎక్కువ చేసిన గుర్తుంచుకోదగ్గ సినిమాల సాంగ్స్ మాత్రం లేవని చెప్పాలి. తక్కువ సినిమాలు చేసిన క్వాలిటీ స్కోర్ ఇవ్వడం అనేది హిట్ ఆల్బమ్ ని సొంతం చేసుకోవడం ముఖ్యం అని అనిరుద్ ప్రూవ్ చేశారు. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే తమన్ దేవిశ్రీప్రసాద్ సూపర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డితో పడటం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED పాన్ ఇండియా.. అంత లైట్ తీసుకుంటే ఎలా?
×