సంక్రాంతి బరిలో వెంకీ పాన్ ఇండియా మూవీ

స్టార్ హీరో వెంకటేష్ గతేడాది ఎఫ్3 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టు గురించి ఇటీవల ప్రకటించాడు. ఇటీవలే హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు.

హిట్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న సైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమాకు సైంధవ్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో వెంకీ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఓ విషయం బయటకు వచ్చింది. సినిమా వర్గాల సమాచారం మేరకు.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి వార్ లో బాలయ్య చిరు పోటీ పడ్డారు. బాలయ్య వీర సింహా రెడ్డి గా వస్తె... చిరు వాల్తేరు వీరయ్య గా వచ్చి ఇద్దరు హిట్ కొట్టారు. ఇక విజయ్ వారసుడు గా అజిత్ తెగింపు గా వచ్చి పర్వాలేదని పించరు. ఇక నెక్స్ట్ సంక్రాంతి బరిలో బాలయ్య 108 ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య 108 సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే బరిలో చెర్రీ బన్నీ కూడా నిలిచే అవకాశం ఉంది. చరణ్ rc15 బన్నీ పుష్ప 2 సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నట్లు సమాచారం. ఇక వీరితో సైందవ్ గా వెంకీ పోటీ పడితే ... ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్ మెంట్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వెంకటేష్ నటించబోయే 75వ సినిమా కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాకు సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఇది రానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక వెంకీ రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED సినిమా సూపర్ కలెక్షన్స్ మాత్రం నిల్!
×