బాలయ్య వీరసింహం తగ్గట్లేదుగా... 18 రోజుల కలెక్షన్స్ ఇవే..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య పోటీగా వచ్చినా.. బాలయ్య సినిమా దూసుకెళ్తోంది. వీరసింహారెడ్డిలో బాలయ్య సరసన శృతి హాసన్ హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున సినిమాను నిర్మించింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిందీ మూవీ. తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి హిట్ టాక్ సాధించింది ఈ సినిమా. ఇక సినిమా విడుదలై.. 18 రోజులు దాటినా.... బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

బాలయ్య అంతకుముందు చిత్రం.. అఖండ మెుదటి వారం.. రూ.53.49 కోట్ల షేర్(రూ.87.9 కోట్ల గ్రాస్) సాధించింది. అయితే వీరసింహారెడ్డి మాత్రం మెుదటి వారంలో రూ.68.51 కోట్ల షేర్(రూ.114.95) వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. మెుదటి రోజు రెండో రోజు దూకుడుగా వెళ్లింది బాలయ్య సినిమా.

వీరసింహారెడ్డికి మెుదటి రోజు.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టగా.. ప్రపంచ వ్యాప్తంగా కలిపితే.. తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్ (రూ. 50.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ వచ్చాయి. ఐదో రోజు రూ.7.25 కోట్ల షేర్ రూ. 12.50 కోట్ల గ్రాస్) సాధించింది.

ఇక 18 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాం 17.10కోట్లు సీడెడ్ రూ. 16.40 కోట్లు ఉత్తరాంధ్ర రూ.8.52 కోట్లు తూర్పు గోదావరి రూ.6.55 కోట్లు పశ్చిమ గోదావరి రూ. 4.88 కోట్లు గుంటూరు రూ.7.40 కోట్లు కృష్ణ రూ. 4.70 కోట్లు నెల్లూరు రూ. 2.97 కోట్లు తెలంగాణ ప్లస్ ఏపీ కలిపితే.. 18 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 68.52 కోట్లు (రూ.111.20 కోట్లు గ్రాస్)గా ఉంది. కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాలు రూ.4.81 కోట్లు ఓవర్సీస్ రూ. 5.76 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 18 రోజులు కలిపి చూస్తే.. రూ. 73 కోట్లు షేర్ (రూ. 132.30 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి.

సినిమా మెుత్తం మీద.. 18 రోజుల టోటల్ కలెక్షన్స్ అవి. 74 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది సినిమా. బాక్సాఫీసు వద్ద.. బ్రేక్ ఈవెన్ కోసం పూర్తి చేసుకోగా... ఇంకా 5.09 కోట్ల ప్రాఫిట్ పొందింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నిజంగా లేడీ పవర్ స్టార్... ఇది సాయి పల్లవి రేంజ్
×