'పుష్ప ది రైజ్' మూవీతో టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని దక్కించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఉత్తరాదిలో ఊహకందని విధంగా వసూళ్ల వర్షం కురిపించి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది.
దీంతో 'పుష్ప 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా పై వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ ఈ మూవీని అత్యంత భారీ స్తాయిలో ఎవరూ ఊహించని విధంగా తెరపైకి తీసుకొస్తున్నారు. పార్ట్ 1 లో డైలీ కూలీ తన యాటిట్యూడ్ తో తెగింపుతో సిండికేట్ స్మగ్లర్ గా ఎదిగిన క్రమాన్ని చూపించగా.. 'పుష్ప 2'లో మాత్రం ఆ సిండికేట్ ని ఏలే వ్యక్తి వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాంటెడ్ రెడ్ సాండల్ సామ్రాజ్యానికి డాన్ గా అవతరించిన క్రమాన్ని దేశ విదేశాల్లో నెట్ వర్క్ ని క్రియేట్ చేసుకున్న క్రమాన్ని చూపించబోతున్నారట.
ఇదిలా వుంటే ఇటీవల అదిగో ఇదిగో అంటూ సాగదీస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. అక్కడ భారీ స్థాయిలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ తెరకెక్కించారట. సినిమాకు ఇది ప్రత్యేక హైలైట్ గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా వుంటే ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ ట్రెమండస్ హిట్ గా నిలవడంతో సుకుమార్ పార్ట్ 2 ని ప్రత్యేక హంగులతో ట్విస్ట్ లతో తెరపైకి తీసుకొస్తున్నారట.
ఇందులో భాగంగానే ఈ మూవీలోని ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులతో పాటు ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తుందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. విషయం ఏంటంటే సినిమాలో బన్నీ రెడ్ సాండల్ స్లగ్లర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే.
అయితే కూలి కాస్త సిండికేట్ పగ్గాలని దక్కించుకునే వ్యక్తిగా పార్ట్ 1 లో చూపించిన సుకుమార్ పార్ట్ 2లో మాత్రం బన్నీని రెడ్ సాండల్ స్మగ్లింగ్ ని దేవ విదేశాల్లో విస్తరించే డాన్ గా చూపించబోతున్నాడట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అన్ని ఈ లుక్ లో కనిపించి కేకల్ పెట్టించనున్నాడని ఈ సీన్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా సినిమాలో పార్ట్ 1 కు మించిన స్థాయిలో కొత్త పాత్రలు వుంటాయని ఇవి సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ మూవీ విషయంలో సుకుమార్ భారీ ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడని సినిమాని ఎవరూ ఊహించని స్టాండర్డ్స్ లో తెరపైకి తీసుకురాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కీలక పాత్రల్లో ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ తదితరులు నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2024 జనవరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.