పవన్ ఇజ్ బ్యాక్... వింటేజ్ లుక్స్ వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. పవన్ ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల అనే సినిమా చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ లేటెస్ట్ లుక్స్ వైరల్ గా మారాయి. ఆయన వింటేజ్ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది. 2012 లోని ఫోటోలు... ఇప్పుడు ఫోటోలు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. మళ్ళీ ఆ వింటేజ్ లుక్ లోకి మారారని తెలుస్తోంది. అందులోను 2012 లో వేసిన జాకెట్ ... ప్రసేంట్ వేసిన జాకెట్ ఒకేలా ఉంది. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అప్పటి లుక్ లోకి వచ్చేశాడు అని సంబర పడిపోతున్నారు.

ఇదిలా ఉంటే పవన్... సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG గా రానున్నారు. ఇప్పటికే ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. పైగా అతడు పవన్కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైయ్యాయి. ఈ ఫొటోస్ ఏ వైరల్ గా మారాయి. ఇందులో పవన్ లుక్ వింటేజ్ లుక్ ను తలపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోతో ఫొటోలు పవన్ స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ ఈజ్ బ్యాక్ యంగ్ లుక్లో కనిపిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరక్టర్ తమన్ కూడా వచ్చారు. దీంతో ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా తమన్ దాదాపుగా ఖరారైనట్లేనని అనుకుంటున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక హరిహర వీర మల్లు సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. అర్జున్ రామ్పాల్ నర్గీస్ ఫక్రి వంటి బాలీవుడ్ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎమ్ రత్నం దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ మలయాళం తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేయనున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇండస్ట్రీ రింగ్ మాస్టర్లు రాజకీయాలతో విసుగెత్తాను!-పీసీ
×