మోడీ ఎఫెక్ట్ ? రాహుల్.. జోడో యాత్రకు బ్రేక్.. రీజన్ ఇదే!

కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్రను శుక్రవారం అర్ధంతరంగా నిలిపివేశారు. నిర్ణీత పాదయాత్ర లక్ష్యం పూర్తికాకుండానే రాహుల్ బస చేయాల్సిన ప్రాంతానికి వెళ్లిపోయారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీనే కారణమని కొందరు వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు  ఒక్కసారిగా భగ్గు మన్నారు. కీలకమైన జమ్ము కశ్మీర్లో యాత్ర చేస్తున్నతనకు పోలీసులు సహకరించడం లేదని.. రాహుల్ స్పష్టం చేశారు.  భద్రతను కల్పించడంలో పోలీసులు విఫలమవ్వడం వల్ల యాత్రను కశ్మీర్లోని ఖాజీగుండ్లో యాత్రను నిలిపివేస్తున్నట్లు రాహుల్ తెలిపారు.

రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించట్లేదని అన్నారు. జోడో యాత్రకు మిగతా రోజుల్లోనైనా మెరుగైన భద్రతా కల్పిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించుకున్నానని తెలిపారు రాహుల్ గాంధీ.

దీనిపై పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ..  "జమ్ముకశ్మీర్లో రాహుల్ గాంధీ భద్రతతో ఆడుకోవడం ద్వారా ప్రభుత్వం తన అల్ప బుద్ధిని చూపించింది. భారత్ ఇప్పటికే ఇందిరాగాంధీ రాజీవ్గాంధీని కోల్పోయింది. ఏ ప్రభుత్వమైనా ప్రముఖుల భద్రతపై రాజకీయాలు చేయడం మానుకోవాలి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భద్రతా ఉల్లంఘనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి`` అని వ్యాఖ్యానించారు.

అయితే రాహుల్ భద్రత విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పక్షపాత వైఖరి కారణంగానే పోలీసులు విధుల నుంచి తప్పుకొన్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం.. రాజకీయంగా మంటలు రేపింది. ఇదిలావుంటే  జోడో యాత్రలో ఎటువంటి భద్రతా లోపం లేదని జమ్ముకశ్మీర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బనిహాల్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొంటారని పోలీసులకు జోడో యాత్ర నిర్వాహకులు ముందుగా సమాచారం ఇవ్వలేదని అన్నారు. యాత్రను నిలిపివేయడానికి ముందు జమ్ముకశ్మీర్ పోలీసులను యాత్ర నిర్వాహకులు సంప్రదించలేదని పేర్కొన్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED డేంజర్ జోన్లో ఇద్దరు మంత్రులు.. 25 మంది ఎమ్మెల్యేలు..
×