లెజెండ్రీ క్రికెటర్ బయోపిక్ స్క్రిప్ట్ రెడీ!

పలువురు టీం ఇండియా క్రికెటర్స్ బయోపిక్స్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ధోనీ తో పాటు కపిల్ బయోపిక్స్ కు మంచి స్పందన దక్కింది. కమర్షియల్ గా కూడా దాదాపు అన్ని బయోపిక్స్ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ముందు ముందు మరన్ని క్రికెటర్స్ బయోపిక్స్ రాబోతున్నాయి.

అందులో భాగంగానే టీం ఇండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గంగూలీ జీవితం ఆధారంగా సినిమాను రూపొందించబోతున్నట్లుగా రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చింది. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు.

అసలు గంగూలీ యొక్క బయోపిక్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో లవ్ ఫిల్మ్స్ బ్యానర్ గంగూలీ బయోపిక్ పై ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ కోసం వర్క్ జరుగుతుందట.

స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొనేందుకు గాను కోల్కత్తా నుండి గంగూలీ  ముంబయికి వచ్చినట్లుగా లవ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రతినిధులు పేర్కొన్నారు. అతి త్వరలోనే గంగూలీ ఫైనల్ స్క్రిప్ట్ కు ఓకే చెప్తాడని తాము ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు.

వచ్చే నెలలో స్క్రిప్ట్ కు సంబంధించిన తుది రూపు వస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు. గంగూలీ జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలను కవర్ చేయడంతో పాటు ఆకట్టుకునే కమర్షియల్ స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే గంగూలీ బయోపిక్ ను వచ్చే ఏడాది అభిమానుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×