నైజాంలో మైత్రీ వారి కొత్త అడుగులు షురూ!

నైజాం డిస్ట్కరిబ్యూషన్ రంగంలో ముందు నుంచి దిల్ రాజు పాగా వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఏషియన్ ఫిలింస్ వారు కూడా తమ వంతు భాగస్వామ్యాన్ని దక్కించుకుంటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు.

అయితే కొత్తగా నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్ వారు రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి వరకు వున్న సమీకరణాలన్నీ మారిపోయాయి. తొలి సారి నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరిచి డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు మైత్రీ వారు.

తొలి ప్రయత్నంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలని నైజాంలో మైత్రీవారే రిలీజ్ చేశారు. వీటిని నిర్మించింది కూడా వీరే కావడం.. రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాలని దక్కించుకోవడం ఇందులో చిరు నటించిన 'వాల్తేరు వీరయ్య' భారీ లాభాల్ని తెచ్చిపెట్టడంతో మైత్రీవారు ఖుషీగా వున్నారట.

తొలి ప్రయత్నంగా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు లాభాలు తెచ్చిపెట్టడంతో డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ శశితో కలిసి కొత్త అడుగులు వేయడానికి శ్రీకారం చుడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి అడుగులోనే నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో విజయం సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇప్పుడు తమ దృష్టిని థియేటర్ల వైపు మళ్లించినట్టుగా తెలుస్తోంది. కీలక థియేటర్ల లీజ్ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారట.

నైజాం ఏరియా జిల్లాల్లోని పలువురు ఎగ్జిబిటర్లు మైత్రీ వారికి తమ థియేటర్లని లీజుకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. దానికి ప్రధాన కారణం దిల్ రాజు ఏషియన్ సునీల్ వారిని పట్టించుకోకపోవడమేనని అంతే కాకుండా పలు జిల్లాల్లోని థియేటర్లు మరమ్మత్తు దశకు వచ్చేశాయని వాటి ఖర్చు భరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చాలా వరకు ఎగ్జిబిటర్లు మైత్రీ వారిని ఆశ్రయిస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.

మైత్రీవారు దృష్టి పెడుతున్న థియేటర్లు గత కొంత కాలంగా దిల్ రాజు హ్యండ్ లో వున్నావేనని తెలుస్తోంది. ఈ విషయంలో శశి దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు గతంలో థియేటర్లలని దక్కించుకున్న తీరు దిల్ రాజు సోదరుడు శిరీష్ కు పెద్దగా నచ్చడంలేదని అంటున్నారు. అంతే కాకుండా వీరి మధ్య లోకల్ నాన్ లోకల్ వార్ కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.  కొంత మంది మాత్రం ఇది బిజినెస్ ఏదైనా జరగొచ్చని కామెంట్ లు చేస్తున్నారు.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×