శ్రీకాంత్ తనయుడు.. మరో సినిమాకు రెడీ

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో తెరంగ్రేటం చేశాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా చిన్న పిల్లలను ఒక మేర ఆకట్టుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత హీరోగా లాంచ్ అయిన శ్రీ కాంత్ నాయుడు రోషన్ ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందడి అనే సినిమా చేశాడు.

గతంలో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు చేసిన పెళ్లి సందడి క్రేజ్ ఈ సినిమాకి కూడా కలిసి రావడంతో పాటు యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా నటించడంతో ఈ సినిమా ఒక మేర వసూళ్లు కూడా రాబట్టింది. అయితే శ్రీ లీలకు దక్కినంత క్రేజ్ మాత్రం రోషన్ కి దక్కలేదని చెప్పాలి. శ్రీ లీల ప్రస్తుతానికి టాప్ హీరోలతో సైతం సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంటే రోషన్ మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇప్పటివరకు సరైన ప్రాజెక్టు సెట్ చేసుకోలేకపోయాడు.

 అయితే స్వప్న సినిమాస్ బ్యానర్ మీద వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న సినిమా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పీరియాడిక్ డ్రామా అని పీరియాడిక్ డ్రామా నేపథ్యంలోనే ఒక కథ అల్లుకున్నారని తెలుస్తోంది. స్వప్న సినిమాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ల మీద నిర్మితమైన పీరియాడిక్ డ్రామా సీతారామం ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో పీరియాడిక్ సినిమాల మీద నమ్మకం పెట్టుకున్న స్వప్న సినిమాస్ బ్యానర్ ఈ సినిమా కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చూసుకుంటే రోషన్ కి ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్కెట్ లేదు కానీ స్వప్న సినిమాస్ కథ మీద ఉన్న నమ్మకంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్గా స్థిరపడే ప్రయత్నాలు చేస్తూనే మరొక పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతూ దూసుకు వెళుతున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×