ఈ వైసీపీ నేతలంతా పార్టీ పరువు తీసేస్తున్నారుగా..!

రాజకీయాల్లో ఉన్న నాయకులు అందరూ శ్రీరామ చంద్రులు వంటివారు కాకపోవచ్చు. వారు కూడా సహజం గానే వారి పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించడం కామనే. కానీ ఈ  విషయంలో అంతో ఇంతో డిగ్నిటీ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా! కానీ వైసీపీలో ఉన్న కొందరు నేతలు మాత్రం ఈ డిగ్నిటీని పాటించలేక పోతున్నారు. తమ నోటికి ఏది వస్తే.. అదే అనేస్తున్నారు. ఏం చేయాలని అనిపిస్తే.. అదే చేస్తున్నారు.

నిజానికి అన్ని పార్టీల్లోనూ చాలా మంది నాయకులు.. సాధారణ వ్యక్తుల మాదిరిగానే.. ఏదో ఒక అలవాటు ఉన్నవారే. దీనిని తప్పుగా కూడా చూడాల్సిన అవసరం లేదు. గతంలో బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అధికారంలో ఉండగానే.. తన స్వగ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితులు కనిపించగానే.. వారితో కలిసి.. తాటి చెట్ల కింద కూర్చుని కల్లు తాగుతూ.. చుట్ట పీల్చారు.

ఇది.. అప్పట్లో తీవ్ర సంచలనం వివాదం కూడా అయింది. అసెంబ్లీలో మూడు రోజుల పాటు కార్యకలాపా లకు విఘాతం కూడా ఏర్పడింది. అయితే.. ఈ సందర్భంగా కూడా.. లాలూ తనను తాను సమర్థించుకు న్నారు. నా అలవాట్లు నావి. నేనూ మనిషినేగా అని వ్యాఖ్యానించారు. చివరకు ఇది.. ప్రతిపక్షాలకు అస్త్రం గా మారి.. లాలూను ప్రతిపక్షంలో కూర్చునేలా చేసింది. కట్ చేస్తే.. వ్యక్తిగత అలవాట్లను బహిరంగం చేసు కోవడం.. ఎవరికీ మంచిది కాదు.

కానీ వైసీపీలో ఉన్న కొందరు నాయకులు మాత్రం ఇటీవల కాలంలో తమ వ్యక్తిగత అలవాట్ల విషయాలను బహిరంగ పరుస్తున్నారు. ఇది అప్పటికప్పుడు బాగానే ఉన్నప్పటికీ..మున్ముందు ప్రతిపక్షాలకు.. ప్రత్యర్థులకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుందని.. అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా మొత్తానికే మొసం వాటిల్లే పరిస్తితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పేకాట ఆడే అలవాటు ఉందని చెప్పిన నేపథ్యంలో దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×