ఉద్యోగులందరికీ నడక ఎంత ఇంపార్టెంట్ నో తెలిసింది..

ఇప్పుడు ఎక్కడ చూసినా సాఫ్ట్ వేర్ సంక్షోభాలే. ఇక ఈ ఉద్యోగం చూస్తే రోగాల పాలైన వారే ఉన్నారు. వర్క్ ఫ్రం హోం పేరిట గంటలు గంటలు పనిచేస్తుండడంతో ఉద్యోగుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. తినేసి కూర్చుండడంతో అందరికీ చేటు తెస్తోంది. ఉద్యోగులందరూ కూడా కంప్యూటర్ వర్క్ లకు అలవాటు పడి గుండెపోటు సహా దీర్ఘకాలిక రోగాలకు బలి అవుతున్నారు. అందుకే తాజా పరిశోధన షాకిచ్చింది.

కంప్యూటర్ల ముందు.. ఆఫీసుల్లో కదలకుండా గంటలు గంటలు కూర్చునే వారు 10 ఏళ్లు ముందుగానే పోతారని తాజా సర్వే షాకింగ్ విషయాలు బయటపెట్టింది. అందుకే ఉద్యోగులు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించింది. ముఖ్యంగా తిన్న వెంటనే పడుకోవడమో కూర్చోవడమో చేయకుండా కొన్ని అడుగులు నడవాలని డాక్టర్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గుతాయి.

ఉద్యోగాలు చేసే వారందరికీ డయాబెటీస్ వ్యాధి పొంచి ఉందని అంటున్నారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో 90 శాతం మంది ఎక్కువ సేపు కూర్చునే వారికే వస్తుందట.. ఇదో తీవ్రమైన అనారోగ్య సమస్య.

దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇతర రోగాలు వచ్చి మొత్తం శరీరంలోని అవయవాలన్నీ చెడిపోయి మరణిస్తాడు. గాయాలు తగిలినా కూడా ఇబ్బందే.

వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఒకటే వ్యాయామం. అందులోనే నడకను మించింది లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది అని సూచిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. మరెన్నో సమస్యలను నియంత్రణలో ఉండడానికి దోహదపడుతుంది.

కంప్యూటర్ ముందు కూర్చునే వారు.. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారంతా క్రమం తప్పకుండా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×